ఆంధ్రా రాజకీయాలు:”సైలెన్స్ ప్లీజ్”..!

Chandrababu-Naidu-Security

ప్రభుత్వం పై ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలు, ఆ విమర్శలకు వైసీపీ నేతల కౌంటర్లు, ఆ కౌంటర్లకు విపక్షాల నిరసనలు, ఆ నిరసనకు కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిల్లు…ఇలా చాల పంచాయితీనే నడుస్తూ ఉండేది ఏపీ రాజకీయాలలో. అయితే చంద్రబాబు స్కిల్ కేసు నుండి నాలుగువారాల తాత్కాలిక బెయిలుతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చిన నాటి నుండి ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయారు అధికార వైసీపీ నేతలు.

జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబుకి వచ్చిన ప్రజాదరణ చూసిన వైసీపీ ప్రభుత్వపెద్దలుకు తాము తీసుకున్న నిర్ణయం ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకతను మూటకట్టుకుందో,అలాగే ప్రత్యర్థి పార్టీ అయినా టీడీపీకి ఎంతటి బలాన్ని చేకూర్చి పెట్టిందో కళ్లారా చూడడంతో అర్ధమయినట్లు ఉంది. ఆ కారణంతోనే సకల శాఖ మంత్రి గారు బాబు విడుదలైన రెండు రోజులు మీడియాలో హడావుడి చేసి సైలెంట్ గా తప్పుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఇక బాబు ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు వైసీపీ నేతలు.

ADVERTISEMENT

ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికి వస్తే…,ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు అరెస్టుతో జగన్ తన లక్ష్యాన్ని కొంత వరకు చేరుకున్నారని చెప్పాలి. నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబుని దాదాపుగా 50 రోజుల పాటు జైలుకు పంపి ప్రజలకు దూరం చేయగలిగారు. అంతే కాదు ఇప్పుడు ‘కండిషన్స్ అప్లై’..,అంటూ బాబుని ప్రజలకు చేరువకానివ్వలేదు.ప్రజా సమస్యలపై ప్రభుత్వాలతో నిత్యపోరాటం చేసే చంద్రబాబు ఒక్క సారిగా సైలెంట్ అయ్యిపోవాల్సిన పరిస్థితులును రాష్ట్రంలో సృష్టించడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

తండ్రి అరెస్టుతో అటు పార్టీ నేతలను సమన్వయ పరుచుకుంటూ ఇటు కుటుంబసభ్యులకు అండగా నిలబడుతూ తండ్రి కోసం న్యాయపోరాటాలు చేస్తూ ఆనాడు దూరమైన ప్రజాక్షేత్రానికి లోకేష్ ఇంతవరకు చేరుకోలేకపోయారు. అలాగే వారాహి యాత్రతో ఒక్కసారిగా రాష్ట్రమంతా తన పార్టీ జనసేన గురించి చర్చ జరిగేలా చేసుకున్న పవన్ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయారు. బాబు అరెస్టు తరువాత స్వచ్ఛదంగా వచ్చి టీడీపీకి తన మద్దతు తెలియచేసిన పవన్ ఆ తరువాత అంచెలంచెలుగా ప్రభుత్వం మీద తన విమర్శల దూకుడిని తగ్గించుకుంటూ వచ్చారు.

అటు తెలంగాణాలో ఎన్నికల పోటీకి సిద్దమైనప్పటికీ అక్కడ కూడా తన పార్టీ నేతల ఎన్నిక ప్రచారాలకు పవన్ దూరంగానే ఉండిపోయారు.ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాబు అరెస్టుతో మొదలై బాబు బెయిలు తో…,ఒకరకంగా మూగబోయాయనే చెప్పాలి. ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఉన్న ఈ కొద్దీ కాలం ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చాల విలువైంది. అయినప్పటికీ టీడీపీ, జనసేనలు ఈ అమూల్యమైన సమయాన్ని కాలయాపనతో వృధా చేస్తున్నారనే చెప్పాలి.

ఉమ్మడి పార్టీల కమిటీలు, మీటింగులు, చర్చలు అంటూ పార్టీల నేతలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. అలాగే అధినేతలు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైపల్యాలను ఎత్తిచూపడం లేదు. కారణాలు ఏదైనా కావొచ్చు ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండి రాజకీయాలు చేయడం ఆపార్టీ నేతలకే కాదు పార్టీ మనుగడకే దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదు. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతనే ఏపీలో ఎన్నికల వేడి రాచుకుంటుందేమో చూడాలి. అప్పటి వరకు ఏపీ రాజకీయాలలో అధికార – ప్రతిపక్ష పార్టీలు “సైలెన్స్ ప్లీజ్”..అన్నట్టు గ్రంధాలయాలను తలపిస్తాయేమో.

ADVERTISEMENT
Latest Stories