ఇక పోటీ తెలంగాణతో కాదు… ఆంధ్రాతోనే!

Andhra Pradesh Vs Telangana Development

ఏపీతో పోలిస్తే నేటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమే. ఏపీలో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తున్నాయి. గత రెండేళ్ళ నుంచే మళ్ళీ రాజధాని అమరావతి, పోలవరం, రాష్ట్రంలో ఇతర సాగునీటి ప్రాజెక్ట్ పనులు జోరుగా సాగుతున్నాయి.

కానీ తెలంగాణకు హైదరాబాద్‌ ఉంది. దానిలో దశాబ్దాల క్రితం నుంచే అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఉన్నాయి. వాటితో ఎన్నటికీ తరగనంత సంపదనిచ్చే అక్షయపాత్రగా నిలుస్తోంది హైదరాబాద్‌.

ADVERTISEMENT

కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే, పదేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందింది. కనుక తెలంగాణ ఆర్ధికంగా మరింత బలపడింది.

కానీ ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పోటీ పడే స్థాయికి ఎదిగింది. అమరావతి, పోలవరం, వెలిగొండ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కొత్త పోర్టుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు, భారీగా నిధులు అవసరమైన ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పధకాలు అమలవుతుండటం చూస్తున్నప్పుడు, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ కాస్త ముందున్నట్లే అనిపిస్తుంది.

ఇక్కడ చర్చ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న ఈ పోటీ గురించి కాదు. పాలకులకు పట్టుదల, దూరదృష్టి, చిత్తశుద్ది ఉన్నట్లయితే రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందగలవో అర్థం చేసుకునేందుకే.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ సర్వస్వం కోల్పోయింది. మళ్ళీ గత ఐదేళ్ళపాటు అభివృద్ధి పట్టాలు తప్పింది. కానీ కేవలం రెండేళ్ళలోనే ఇంత అభివృద్ధి జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. కనుక ఇప్పుడు తెలంగాణతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ ఎదిగింది.

రేపు అమరావతి, పోలవరం పూర్తయి, రాష్ట్రంలో పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకుని వాటితో లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో నంబర్ 1 స్థానంకి చేరుకోవడం తధ్యం.

అప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడాల్సి రావచ్చు. కానీ ఇది చాలా ఆరోగ్యకరమైన పోటీయే కనుక అన్ని రాష్ట్రాలు గెలవాలి.. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలి అని కోరుకుందాం.

ADVERTISEMENT
Latest Stories