‘ట్రైన్’ ఎపిసోడ్ అదిరిపోతుందట!

Anil Ravipudi on Raja The Great movie Train Scene“పటాస్… సుప్రీమ్…” వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ ను సొంతం చేసుకుని, ట్రేడ్ వర్గాల్లో పక్కా కమర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి నుండి “రాజా ది గ్రేట్” చిత్రం రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ లభించగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. హీరో రవితేజ మరియు ఫైటర్స్ పై చిత్రీకరించనున్న ఈ యాక్షన్ సన్నివేశాన్ని ట్రైన్ లో షూట్ చేయబోతున్నారట. ‘రాయఘర్’లో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించడం కోసం చిత్ర బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. రైలు నేపధ్యంలో సాగనున్న ఈ యాక్షన్ సీన్ “రాజా ది గ్రేట్”కే హైలైట్ గా నిలవనుందన్నది లేటెస్ట్ న్యూస్.

ADVERTISEMENT

యాక్షన్ సన్నివేశాలను రూపకల్పన చేయడంలో అనిల్ రావిపూడి ప్రత్యేకత, ఈ ఫైట్ లో ఖచ్చితంగా కనిపిస్తుందని బలంగా వినపడుతోన్న మాట. ‘పటాస్’లో అమ్మల చేత యాక్షన్ సీన్స్ చేయించిన అనిల్, ‘సుప్రీమ్’లో హ్యాండీక్యాప్డ్ వాళ్ళ చేత వినూత్నంగా చేయించిన విషయం తెలిసిందే. ఈ రెండూ కూడా ఆయా సినిమాలలో హైలైట్ అయ్యాయి. ‘దీపావళి’ కానుకగా అక్టోబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాలో ఈ ట్రైన్ ఫైట్ కూడా అదే రేంజ్ లో రానుందని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories