‘సూపర్ స్టార్’ సరసన తెలుగు ముద్దుగుమ్మ అంజలి!

Anjali malayalam movieఅభినయం పుష్కలంగా ఉన్నా తెలుగులో అంతంత మాత్రం అవకాశాలనే అందిపుచ్చుకుంటున్న తెలుగు బ్యూటీ అంజలి మలయాళం సూపర్ స్టార్ ముమ్ముట్టి సరసన నటించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. “పెరంబు” పేరుతో తెరకెక్కనున్న తమిళ సినిమాలో ముమ్ముట్టితో పాటు వెండితెరను పంచుకోనుంది అంజలి.

దాదాపు ఆరు సంవత్సరాలుగా తమిళ సినిమా చేయని ముమ్ముట్టి, ఈ నెలాఖరు నుండి ప్రారంభం కాబోయే షూటింగ్ లో భాగస్వామ్యం కానున్నారు. ముసలి వయసులో ఉన్న పాత్రలో ముమ్ముట్టి నటించనుండగా, అతను పెళ్లి చేసుకోబోయే చిన్న పిల్ల పాత్రలో అంజలి కనువిందు చేయనుంది.

ADVERTISEMENT

ఈ నెల 14వ తేదీన విడుదల కాబోయే “డిక్టేటర్”లో బాలకృష్ణ సరసన నటించిన అంజలి, ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకుని, ఈ నెలాఖరున చెన్నైలో ప్రారంభం కాబోయే “పెరంబు” చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది.

ADVERTISEMENT
Latest Stories