బాలీవుడ్ లో ప్రస్తుతం జీవిత చరిత్రల సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే మరికొన్ని సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధోని, సచిన్ టెండూల్కర్ ల జీవితచరిత్రలు లైన్ లో ఉండగా, తాజాగా అన్నా హజారే జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన “అన్నా” కూడా ఈ జాబితాలో చేరింది.
అక్టోబర్ 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేసారు. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించి, కుళ్ళిపోయిన దేశ రాజకీయాలను ప్రక్షాళన చేసే స్థాయికి ఎదిగిన వైనం, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తిగా అందరి మన్ననలు పొందిన హజారే జీవితంలో సాధారణ ప్రజలకు తెలియని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలాంటి ఉదంతాలతో కూడిన ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఈ టీజర్ ను కట్ చేసారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



