తెలంగాణలో జగన్ డబుల్ రోడ్: పోసానితో కేసీఆర్ కు..,షర్మిలతో కాంగ్రెస్ కు.!

YS Jagan Kurnool Judicial Capital

ప్రత్యర్థి పార్టీ మీద నిందలు వేయడం, ప్రత్యర్థులను అవహేళన చేయడంలో మాస్టర్ డిగ్రీ పొందిన వైసీపీ నాయకులు ఇతరులకు మేము ఈ అవకాశం ఇవ్వము అనే భ్రమలో రాజకీయాలు చేసేద్దాం అని ఆరాటపడుతుంటారు. ఎంతో గుట్టుగా తమ రాజకీయ కార్యక్రమాలు ముగించేయాలి అని ఆశపడిన వైసీపీ పార్టీకి ఏదోఒక రూపంలో ఎదురుదెబ్బ తగలడం గుట్టు బయటకు రావడం సర్వ సాధారణం అయ్యిపోయింది.

విషయానికి వస్తే..,తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ – వైసీపీ పార్టీలు తమ మద్దతుదారులు ఏ పార్టీ పక్షాన నిలబడాలి అనేదానికి ఎక్కడా ఒక ప్రకటన కూడా చేయలేదు.చంద్రబాబు అరెస్టుతో బాబుకి టీడీపీ పార్టీకి ప్రజలలో వచ్చిన సింపతీని కాష్ చేసుకోవడానికి తెలంగాణలో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ అని తేడాలేకుండా అన్ని పార్టీల నాయకులు బాబు అరెస్టుని ఖండించి టీడీపీ అభిమానులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు.

ADVERTISEMENT

దీనిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ మొదలుకుని దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతల వరకు టీడీపీ సానుభూతిపరులను ఆకర్షించే చర్యలు చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు కి ఒకప్పుడు ప్రియ శిష్యుడు కావడంతో టీడీపీ మద్దతుదారులతో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తుంది అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బలంగా విశ్వసించడం దీనికి మరో కారణం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలలో కాంగ్రెస్ పార్టీ జెండాలకూ తోడు టీడీపీ జెండాలు కూడా రెపరెపలాడడం ఈ ప్రచారానికి మరికొంత బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఇదేదో చంద్రబాబు దగ్గరుండి తమ పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ సభలలో టీడీపీ జెండాలు మోయిస్తున్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా మామ విజయ సాయి X మాధ్యమం ద్వారా ఒక పోస్ట్ వదిలారు.

ప్రియాంక వాద్రా ర్యాలీలలో టీడీపీ వాళ్ళు జెండాలు మోయడానికి సిగ్గుండాలి.బాబు గారి, పురందరేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకు ఇది నిదర్శనం. బీజేపీ లో ఉంటూ ఏపీలో టీడీపీకి బాకా ఊదే పురందరేశ్వరి తెలంగాణలో మీ బావ కాంగ్రెస్ కు అండగా నిలబడడాన్ని మీరేమంటారో మరి!అంటూ విలువల గురించి మాట్లాడిన విజయసాయి రెడ్డికి టీడీపీ నుండి సరైన కౌంటర్ పడడానికి ఎంతో సమయం ఇవ్వలేదు ఆ భగవంతుడు.

తెలంగాణలో చెల్లి షర్మిల పెట్టిన వైస్సార్ టీపీ జెండా, ఏపీలో జగనన్న వైసీపీ జెండాలతో అదే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల బైక్ ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇదేమి దేవుడి స్క్రిప్ట్ఓ కానీ ఆ చిత్రాలను అలానే తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విజయ సాయి రెడ్డికి ట్యాగ్ చేశారు. ఇప్పుడు చెప్పు తమ్ముడు మీ బాధేమిటో? చెల్లితో తెలంగాణలో ఒక పార్టీని స్థాపించి ఆమె ద్వారా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు అందించి ఎన్ని చీకటి ఒప్పందాలు
కుదుర్చుకున్నారు?

ఏపీలో బీజేపీ తో తెలంగాణలో కాంగ్రెస్ తో ఈ చీకటి పొత్తులన్నీ కేసుల మాఫీకేనా తమ్ముడు,! అంటూ టీడీపీ శ్రేణులు అదే సోషల్ మీడియా సాక్షిగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ తమ్ముడు విజయ సాయిని గట్టిగా ఆడుకుంటున్నారు.ఇదంతా వైసీపీ నాణానికి ఒక వైపు మాత్రమే.మెంటల్ కృష్ణ గా ఖ్యాతిపొందిన పోసాని కృష్ణ మురళి వైసీపీ పార్టీ మరో కోణాన్ని
బయటపెట్టారు. ఎన్నికల ప్రచారానికి గడువు కొద్దిగంటలే ఉందనగా తెరమీదకు వచ్చిన అనధికార వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ పోసాని సీమాంధ్రులు అందరు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.

కేసీఆర్ నాయకత్వంలో సెటిలర్స్ అందరు ఎంతో సంతోషంగా ఉన్నారంటూ ఆయనగారే కేసీఆర్ పాలనకు ఒక సరిఫికేట్ ఇచ్చేసి వైసీపీ పార్టీ మరో కోణాన్ని ప్రజలు ముందుంచారు. అసలే బాబు అరెస్టుతో జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్న ఉన్న సెటిలర్స్ కు బిఆర్ఎస్ – వైసీపీ మధ్య ఉన్న అక్రమ సంబంధం ఏమిటో సక్రమంగా వివరించారు పోసాని.మొత్తానికి బంధం బయటపెట్టారుగా రాజా… ఇక అసలు సంగతి సెటిలర్స్ చూసుకుంటారులే అంటున్నారు టీడీపీ శ్రేణులు.మొత్తానికి జగన్ “పోసానితో కేసీఆర్ కు..,షర్మిలతో కాంగ్రెస్ కు” తన గాలి సందేశాన్ని పంపి తెలంగాణలో తన పార్టీ కి డబుల్ రోడ్డు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories