YS Sharmila Politics

వైస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ గా, వైస్ జగన్ మోహన్ రెడ్డి వదిలిన బాణంలా ఏపీ రాజకీయాలలోకి దూసుకొచ్చిన వైస్ షర్మిల, వైసీపీ గెలుపుతో తెలంగాణ రాజకీయాలలోకి అడుగు పెట్టారు. టీ. వైసీపీ పార్టీ పేరుతో తెలంగాణలో పాదయాత్రలతో రాజకీయం మొదలు పెట్టిన షర్మిల పార్టీ విలీన ప్రక్రియతో తిరిగి పుట్టింటికి చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఏపీలో తిరిగి రాజకీయం మొదలు పెట్టిన షర్మిల తన రాజకీయ భవిష్యత్ కోసం రాజకీయం చేస్తున్నారా.? లేక తన అన్న జగన్ రాజకీయ భవిష్యత్ ను సమాధి చేయడానికి రాజకీయాలు నడుపుతున్నారా అన్న చందంగా ముందుకెళుతున్నారు.

Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?

2024 ఎన్నికలలో వైసీపీ ఓటమే తన ప్రధమ కర్తవ్యం అన్న చందంగా జగనన్న మీద తన సోదరి సునీత తో కలిసి విరుచుకుపడ్డారు షర్మిల. చివరికి తల్లి విజయలక్ష్మి తో కూడా తనకు అనుకూలమైన స్టేట్మెంట్స్ ఇప్పించి జగన్ ను నైతికంగా పతనం చేయగలిగారు షర్మిల.

వైస్ కుటుంబమంతా తన వైపే నిలబడింది అనేలా వివేకా కుటుంబంతో కలిసి ఎన్నికల ప్రచారానికి దిగిన షర్మిల తానూ రాజకీయంగా ఓడినప్పటికీ వైసీపీ ఓటమితో నైతికంగా తన పంతాన్ని మాత్రం గెలిపించుకున్నారు. ఇలా ఒకప్పుడు అన్న గెలుపు కోసం పాదయాత్రలు చేసిన చెల్లి ఇప్పుడు మాత్రం అన్న వినాశాన్ని కోరుకుంటూ రాజకీయ యాత్రలు చేస్తున్నారు.

Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పూర్తిగా సమాదైపోయింది. ఏపీలో ఇప్పుడున్న త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవానికి రావడం అనేది అసాధ్యమయిన విషయమే. ఇక ఆ పార్టీని పట్టుకుని షర్మిల రాజకీయంగా ఎదగాలి అనుకోవడం అంటే కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదినట్టే అవుతుంది.

అయినా కానీ షర్మిలకు మరో అవకాశం లేకుండా పోయింది. ఇటు అన్నకు వ్యతిరేకంగా టీడీపీ లోకి కానీ జనసేనలోకి కానీ షర్మిల వచ్చే పరిస్థితి లేదు. అలాగే తన తండ్రి రాజకీయ విలువలను పుణికి పుచ్చుకుని రాజకీయం చేస్తున్నాను అంటూ చెప్పుకుంటున్న షర్మిల రాజశేఖర్ రెడ్డి విభేదించే బీజేపీ పంచన చేరలేదు.

Also Read – భారత్‌ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు

కానీ అన్న కు వ్యతిరేకంగా తన గళం వినిపించడానికి, పులివెందుల కోట రహస్యాలతో వైసీపీ ని భయపెట్టడానికి మాత్రం షర్మిల కు ఒక రాజకీయ వేదిక అనేది అవసరం. ఇప్పుడు షర్మిల ఆ దిశగా నే రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అందులో భాగంగానే సందర్భం చిక్కినప్పుడల్లా వైసీపీ మీద ఆ పార్టీ అధినేత మీద షర్మిల విరుచుకుపడుతున్నారు.

ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కావాలంటూ గగ్గోలు పెడుతున్న జగన్ ప్రజలు తనకిచ్చిన 11 ఎమ్మెల్యే స్థానాలకు గౌరవం ఇస్తున్నారా.? అసెంబ్లీ కి వెళ్లి చట్ట సభలలో ప్రజా సమస్యల మీద పోరాడడానికి భయపడే మీరు మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చెయ్యండి అంటూ వైసీపీ నేతలను నిలదీస్తున్నారు షర్మిల.




బీజేపీ తో వైసీపీ చేసే తెరచాటు రాజకీయాన్ని బహిర్గతం చేస్తూ జగన్ మోడీకి దత్తపుత్రుడు అంటూ జగన్ పై కౌంటర్లు వేస్తున్నారు. ఇలా తన ఎదుగుదలకు కాకుండా తనను మానసికంగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా, ఆర్థికంగా నమ్మించి దెబ్బ కొట్టిన తన ప్రత్యర్థి జగన్ వినాశనానికే తొలి ప్రాధాన్యం అంటున్న షర్మిల రాజకీయంగా ఎదిగేదెప్పుడు.?