తెలంగాణ రాష్ట్ర రాజధానిగా హైద్రాబాద్ ప్రపంచ వ్యాప్తంగా అందరికి సుపరిచితమే. పెట్టుబడులకు నిలయంగా, ఉపాధి కి మార్గంగా, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా కనిపించే హైద్రాబాద్ ఒక చిన్న పాటి వర్షానికి ఏ విధంగా మారిపోతుందో అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలే ఉన్నాయి.
తాజగా నిన్న హైద్రాబాద్ లో గంట పాటు కురిసిన వర్షం హైద్రాబాదీయుల వాన కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. మహానగరంగా పేరు గావించిన హైద్రాబాద్ ఒక అరగంట వర్షానికే చిగురుటాకులా వణుకుతుంది. వర్షపు నీటితో రోడ్లు చెరువులను, నదులను తలపిస్తున్నాయి.
డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల మీద వాహనదారుల ఇక్కట్లకు కొదవే లేదు. వర్షం వస్తే చాలు హైద్రాబాద్ లో వాహనదారుల కష్టాలు అన్ని ఇన్ని కావు. గంటలకు పై బడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం, రోడ్లని వర్షపు నీటి తో నిండిపోయాడంతో ఎక్కడ గుంటుందో, ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలుసుకోలేక అనేకమంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.
గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ లాంటి ఐటీ కారిడార్ ప్రాంతాలలోనే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక హైద్రాబాద్ శివారు ప్రాంతాలలో ప్రజల వర్షపు కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో ఉంచడం కష్టమే. వర్షానికి హైద్రాబాద్ ఏ విధంగా వణుకుతుంది అనేది నిత్యం వార్తలలో వింటూనే ఉంటాం, చూస్తూనే వస్తాం.
అటువంటి అభివృద్ధి చెందిన హైద్రాబాద్ లో ఈ రకమైన పరిస్థితులను చూస్తూ కూడా తెరాస అధినేత కల్వకుంట్ల కవిత ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఏపీ రాజధాని అమరావతి ని వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడం, వాన కాలం వస్తే మీ సచివాలయంలో సీఎం సీటు కిందకు నీళ్లు చేరకుండా చూసుకోండి అంటూ అవహేళన చేయడం,
వానాకాలం మొదలైతే అమరావతిలో ప్రయాణం చెయ్యాలంటే పడవలు వాడాలా అంటూ వెటకారం గా మాట్లాడడంతో హైద్రాబాద్ లో కురిసిన వర్షానికి పిడుగు మాత్రం కవిత మీద పడినట్లయింది. పక్క రాష్ట్ర రాజధాని గురించి తరువాత వెటకారాలు చెయ్యొచ్చు కానీ ముందు మీ రాష్ట్ర రాజధానికి వర్షాల నుంచి రక్షణ కల్పించుకోండి అంటూ ఒకరు,
గత పదేళ్ల మీ బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ లో చేసిన అభివృద్ధి ఇదేనా అక్కా అంటూ మరొకరు, ప్రత్యేక తెలంగాణ వస్తే తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మారుస్తా అంటూ మీ తండ్రి కేసీఆర్ చేసిన ప్రకటనల పరమార్ధం ఇదేనా అంటూ ఇంకొకరు, వర్షం వస్తే హైద్రాబాద్ లో పడవలు కావాలా అంటూ ఇంకొందరు ఇలా సోషల్ మీడియాలో కవిత మీద దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు.
అయితే ఇందుకు కవిత అర్హురాలేనా అంటే గతంలో అమరావతి పై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇదే సరైన జవాబు అంటూ కవిత మీద పడిన పిడుగులాంటి ట్రోలింగ్ ని చాలామంది వరకు సమర్థిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి పుష్కర కాలం గడిచినా వర్షం వస్తే ఇప్పటికి హైద్రాబాద్ పరిస్థితిలో ఎటువంటి వ్యత్యాసం రాలేదని,
కేసీఆర్ పదేళ్ల పాలన, రేవంత్ హైడ్రా కూల్చివేతలు కూడా హైద్రాబాద్ ని వర్షపు కష్టాల నుంచి బయట పడేయలేకపోతున్నాయని, అటువంటి అప్పుడు ఆంధ్రోళ్లు అంటూ ఏపీ వారిని అవమానించడం, ఏపీ రాజధాని వరద ప్రాంతం అంటూ హేళన చెయ్యడం, ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్లే అవుతుంది. కాబట్టి కవిత ఇటువంటి ట్రోలింగ్ ట్రీట్మెంట్ ను మున్ముందు మరింతగా ఎదుర్కోవాల్సిందే…!






