AP Congress President Sharmila's Political Mistake

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నుండి తెలంగాణ రాజకీయాల వరకు పాదయాత్రలతో ప్రయాణం చేసిన వైస్ షర్మిల రాజకీయ పయనం గమ్యం లేని ప్రయాణం మాదిరి ఇప్పటికి గాలిలో దీపం మాదిరి, గాలికి తెగిపడిన గాలిపటం మాదిరి రెపరెపలాడుతూనే ఉంది.

చెప్పుకోవడానికే తప్ప అనుభవించడానికి లేదు అనేలా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన షర్మిల తన రాజకీయంతో పార్టీకి కానీ తనకు కానీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చుకోలేకపోతున్నారు.

Also Read – జగన్‌ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?

టి. వైసీపీ పార్టీ తో తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టిన షర్మిల తన ఒంటరి ప్రయాణాన్ని ఎంతో కాలం కొనసాగించలేక కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి, అసలు పునాదులతో సహా కుదేలైన ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా రావడం షర్మిల తీసుకున్న తొందర పాటు నిర్ణయమా.? లేక షర్మిల వేసిన రాజకీయ తప్పటడుగా.?

షర్మిల ఏపీ రాక తో ఆమె రాజకీయ భవిష్యత్ కు ఒక దారి దొరకడం కాదు కానీ జగన్ రాజకీయ భవిష్యత్ కు ఒక అడ్డుదారి తగిలింది. ఏపీలో ఒక పక్క టీడీపీ, మరోపక్క వైసీపీ లు క్షేత్ర స్థాయిలో బలంగా పాతుకుపోయాయి. ఇటు జనసేన కూడా ప్రభుత్వంలో భాగం కావడంతో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది.

Also Read – గులక రాయి తగలడం వల్లనే జగన్‌కి మతిమరుపు?

ఇక టీడీపీ, జనసేన కూటమితో మైత్రి బంధం ఏర్పడడంతో బీజేపీ కూడా ఇంతో అంతో రాజకీయ లబ్దిని పొందుతుంది. ఇన్ని రాజకీయ పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పుంజుకోవడం అంటే అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు.

మరో పదిహేనేళ్ళు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి, ఉంటుంది అంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఆ దిశగా నడిపిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో కూటమి పార్టీలకు తన సత్తా ఎంటో చూపించాలని, వైసీపీ 2.0 ని జగన్ ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి చోటు ఉందా.? షర్మిల రాజకీయ భవిష్యత్ కు ఆశ ఉందా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం షర్మిల తెలంగాణలో ఉండిపోయిన అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏ ఎమ్మెల్సీ పదవో, ఏ మంత్రి హోదానో, లేక రాజ్య సభ ఎంపీ కానో ఎన్నిలకయ్యే వారు.

కానీ వీటన్నిటికీ దూరంగా కాంగ్రెస్ అధిష్టానం చాల వ్యూహాత్మకంగా షర్మిలకు చెప్పుకోవడానికే తప్ప మరి దేనికి ఉపయోగపడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాతో ఆయుధాలు లేని యుద్ధం చెయ్యమని ఏపీకి పంపారు. అయితే నాడు వైసీపీ మీద ఉన్న ద్వేషమో, అన్న జగన్ మీద ఆక్రోసమో షర్మిల ఈ నిర్ణయానికి తలవంచి ఉంటారు.




షర్మిల తీసుకున్న ఆ నిర్ణయం ఆమెకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తుంది. కనుచూపు మేరలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ కనిపించడం లేదు. కనీసం ఆ పార్టీ తరపున షర్మిల తో కలిసి నడవడానికి ఒక ముఖ్య నాయకుడు కూడా కానరాడు. ఇక షర్మిల రాజకీయంగా ఎలా ముందుకెళ్లగలరు.? ఇంకెంత కాలం నిష్ప్రయోజనకరమైన పోరాటాలు చెయ్యగలరు.?