lokesh-nara-ap-education

సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థపై జగన్‌ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ఏవిదంగా వికటించాయో అందరూ కళ్ళారా చూశారు. నాడు బొత్స సత్యనారాయణ అయిష్టంగా విద్యాశాఖని స్వీకరిస్తే, నేడు నారా లోకేష్‌ ఏరికొరి ఆ శాఖని తీసుకొని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, వాటి వలన ఏర్పడిన సమస్యలను పరిష్కరించారు.

Also Read – సుప్రీంకోర్టుకే కుచ్చు టోపీ పెడుతున్నారే!

విద్యా వ్యవస్థలో సంస్కరణలంటే అవి విద్యార్ధులకు మరింత విజ్ఞానవంతులను చేసి, వారికి మేలు చేయాలని గట్టిగా నమ్ముతున్న మంత్రి నారా లోకేష్‌, ఇంటర్‌ బోర్డ్ అధికారులు, విద్యావేత్తలతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో కొత్తగా ఎంబైపీసీ అనే కొత్త గ్రూప్ ప్రవేశపెట్టిస్తున్నారు. ఈ గ్రూప్ తీసుకున్న విద్యార్ధులు మెడికల్, ఇంజనీరింగ్‌ దేనికైనా ప్రవేశ పరీక్షలు వ్రాయవచ్చు.

మాజీ సిఎం జగన్‌ తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వ్యవహరించేవారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తప్ప విద్యార్ధులు జీవితం రాణించలేరనే నిశ్చితాభిప్రాయం ఉండేది. కానీ అందుకు ఉపాధ్యాయులు, విద్యార్ధులు సిద్దంగా ఉన్నారా లేదా? అనే విషయం పట్టించుకోకుండా బలవంతంగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయించారు.

Also Read – సలహాదారులంటే వీరు కదా..

కానీ మంత్రి నారా లోకేష్‌ తీరు ఇందుకు పూర్తిగా భిన్నం. ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్ష రద్దు చేయాలనే ప్రతిపాదన మంచిది కాదని అధికారుల సూచనని సానుకూలంగా స్వీకరించి, ఎప్పటిలాగే వార్షిక పరీక్షలు కొనసాగిద్దామని చెప్పారు.

ఇంటర్ తర్వాత విద్యార్ధులు నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలు వ్రాస్తుంటారు. కనుక వాటికి సన్నద్ధం అయ్యేందుకు వారికి మరింత ఎక్కువ సమయం ఉండాలనే ఉద్దేశ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూనియర్ కాలేజీలు జూన్ 1కి బదులు రెండు నెలలు ముందుగా.. అంటే ఏప్రిల్ 1 నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.

Also Read – వైఎస్ అవసరం జగన్‌కే.. అందుకే ఈ హడావుడి?

ఏప్రిల్ నుంచి జూనియర్ కాలేజీలు మొదలవుతాయి కనుక వార్షిక పరీక్షలు నెల రోజులు ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారం నుంచే మొదలై మార్చి రెండో వారంలోగా పూర్తవుతాయి.

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులు ఇంతకాలం నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలు, వాటి విధి విధానాల గురించి వివిద మార్గాల ద్వారా తెలుసుకొని అవగాహన పెంచుకుంటున్నారు.

కానీ ఇకపై ఆ పోటీ పరీక్షలకు సంబందించిన సమస్త సమాచారం విద్యార్ధులు ఇంటర్ పూర్తి చేస్తున్నప్పుడే తెలియజేస్తారు. వాటి స్టడీ మెటీరీయల్ ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా ఇచ్చి కోచింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం దేశ భాషలన్నిటినీ, విదేశీ భాషలు కూడా నేర్చుకునేందుకు ప్రోత్సాహిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇంటర్ స్థాయిలో తదనుగుణంగా అవసరమైన ఆప్షన్స్ కల్పిస్తున్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రధమలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్ ఉంటుంది.




ఈ మార్పులు చేర్పులతో ఇంటర్ స్థాయిలో విద్యార్ధులకు ఎటువంటి నష్టమూ కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరింత మెరుగుపరిచి, విద్యార్ధులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా చేస్తోంది ప్రభుత్వం.