గుంటూరు ‘కారం’ పై వైసీపీ ‘చల్లని’ చూపు.!

Guntur Kaaram

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సినీ పరిశ్రమ పై సీతకన్నేసిన జగన్ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సూపర్ స్టార్ అభిమానులను నొప్పించకూడదని నిశ్చయించుకున్నారో ఏమో కానీ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా టికెట్ల ధరను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జనవరి 12 సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లకు రానున్న గుంటూరు కారం పై ఒక్కో టికెట్ కు 50 రూపాయల వరకు అదనంగా పెంచుకోవచ్చునని ఏపీ ప్రభుత్వ జీవో జారీ చేసింది. రిలీజ్ తేదీ నుండి పది రోజుల పాటు ఈ పెంచిన ధరలతో టికెట్లను విక్రయించుకోవచ్చని జీవోలో సూచించింది. దీనితో ఈ చిత్ర యూనిట్ కు జగన్ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేనట్లే భావించాలి.

ADVERTISEMENT

2019 ఎన్నికలు పూర్తవగానే సినీ పరిశ్రమ మీద, హీరోల రెమ్యూనరేషన్ల మీద, టికెట్ల ధరల మీద ఆంక్షలకు సిద్దమయిన జగన్ సర్కార్ 2024 లో జరిగే ఎన్నికలలో తిరిగి అధికారం దక్కించుకోవాలంటే ఇటువంటి చిన్న చితక విషయాలను చూసి చూడనట్టు పోవాలని డిసైడ్ అయ్యారో లేక వచ్చే నెలలో రిలీజ్ కు సిద్ధం చేసిన యాత్ర -2 కు ఇప్పటినుంచే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారో.? అంటున్నారు సినీ అభిమానులు.

మొత్తానికి ఈ సంక్రాంతికి గుంటూరు కారంపై చల్లని చూపు కురిపించిన జగన్ సర్కార్ మిగిలిన మూడు సినిమాల పై కూడా కనికరం చూపిస్తుందా.?

ADVERTISEMENT
Latest Stories