
స్కిల్ స్కాం కేసులో అరెస్టయ్యి 50 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన బాబుకి కంటి అనారోగ్య సమస్య దృష్ట్యా హైకోర్టు నాలుగువారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుకి సాధారణ బెయిలు ఇష్యూ చేయాలంటూ బాబు తరుపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా సిఐడి అధికారులు దాని పై అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
అయితే ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల పదిహేడున తీర్పుని రిజర్వ్ లో ఉంచారు.తాజాగా నేడు హైకోర్టు చంద్రబాబుకి సాధారణ బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే చంద్రబాబుకి ఇచ్చిన మధ్యంత బెయిలులో ఉన్న కండిషన్స్ ఇంకా కొనసాగుతాయా లేదా అనేది తేలాల్సి ఉంది. బాబు తరుపున సిద్దార్థ లూథ్రా, సిఐడి తరుపున పొన్నవేలు సుధాకర్ న్యాయస్థానంలో తమ తమ వాదనలు వినిపించారు.
చంద్రబాబుకి హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయడంతో కొన్ని నెలల నుండి టీడీపీ శ్రేణుల పడుతున్న ఆందోళనకు ఎట్టకేలకు తెరపడిందనే చెప్పాలి.ఇక రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ లీడర్స్ తమ క్యాడర్ ను కలుపుకుంటూ గ్రౌండ్ లెవెల్ లో పని చేయడానికి సిద్దంకావాలి. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిలు రాకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక మళ్ళీ బాబు వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిలు సంపాదించారు అంటూ అర్ధం లేని విమర్శలు, లాజిక్ లెస్ ప్రశ్నలు మొదలుపెడతారేమో ఈ ప్రభుత్వ సలహాదారులు.