చిరంజీవి ‘ఖైదీ’పై మురుగదాస్ ‘అసంతృప్తి’

AR Murugadoss disappoints with khaidi no 150మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ “ఖైదీ నంబర్ 150”లో హీరోగా న‌టించిన విష‌యం తెలిసిందే. తమిళంలో ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌ తీసిన ‘కత్తి’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తన రీమేక్ సినిమాను చూసిన తర్వాత, కొన్ని సన్నివేశాలపై దర్శకుడు మురుగ‌దాస్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారట‌. అందుకు మంచి కారణాలు కూడా ఉన్నాయి.

ప్రిన్స్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ నిమిత్తం, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న మురుగదాస్, ‘ఖైదీ నంబర్ 150’ వీక్షించిన అనంతరం.., సినిమా అంతా బాగానే ఉందని చెప్పినా, కొన్ని సీన్లపై మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేశారట. సాధారణంగా తాను తీసే సినిమాలో కొన్ని విలువ‌లు ఉండాల‌ని కోరుకుంటారు మురుగదాస్. త‌న చిత్రాల్లో ఆల్కహాల్‌ సీన్లు దాదాపుగా ఉండకుండా చూసుకుంటారు.

ADVERTISEMENT

ఈ విధానాన్ని పాటిస్తూ వస్తున్న మురుగదాస్, సినిమాల్లో క‌నీసం విలన్‌ కూడా ఆల్క‌హాల్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది తాను “క‌త్తి” పేరుతో తీసిన సినిమా రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ఏకంగా హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం నచ్చలేదట. దానితో పాటు కమెడియన్ అలీతో సినిమాలో ఆడవేషం వేయించి తీసిన‌ కామెడీ సీన్లు కూడా అసంతృప్తి క‌లిగించాయని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories