బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ జుహూ ప్రాంతంలోని రహేజా ఆర్చిడ్ లో ఏడవ అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి టెర్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలోకి చొచ్చుకు వచ్చింది. తనది కాని స్థలంలోకి ఇంటి పైకప్పు వచ్చేలా అర్జున్ నిర్మాణం చేసి, దానిపై కసరత్తులు చేసుకునేందుకు వీలుగా జిమ్ ఏర్పాటు చేశాడు. అనుమతులు లేకుండా 16 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేసినట్టు బీఎంసీ అధికారులు గుర్తించారు.
అర్జున్ కపూర్ నిబంధనల అతిక్రమణ నిర్మాణంపై ఓ స్వచ్చంద సంస్థ కార్యకర్త ‘బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ (బీఎంసీ) దృష్టికి తీసుకెళ్లగా వారు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. తమ సిబ్బందికి అనుమతిస్తే, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తారని నోటీసులో బీఎంసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో వివరణ కోరుతూ తొలి నోటీసు జారీ చేయగా… అందుకు స్పందించకపోవడంతో, తాజా నోటీసులో మాత్రం ఏకంగా కూల్చివేతపై హెచ్చరించడం విశేషం.



