ఇస్తామన్నది పిడికెడు, ఇచ్చేది చిటికెడు: ఆంధ్రకు తప్పని తిప్పలు

Arun Jaitleyఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రం మొదటి సంవత్సరం రెవిన్యూ లోటును పూర్తిగా కేంద్రమే భర్తీ చెయ్యాలి. ఆ ప్రకారం మొదటి సంవత్సరం లోటు 13,775 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం చూపింది. అయితే వేరువేరు వంకలతో కేంద్రం దానిని కేవలం 4117.89 కోట్లు అని తేల్చింది.

అయితే ఈ అరకొర నిధులు కూడా ఇవ్వడానికి కేంద్రానికి చేతులు రావడం లేదు. 4117.89 కోట్లలో కేంద్రం ఆల్రెడీ 2303 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. ఆ మిగిలిన 1814.89 కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం తాత్సారం చేస్తుంది. రాష్ట్ర అధికారులు కాళ్ళు అరిగేలా తిరిగాక 369 కోట్లు మంజూరు చేసింది కేంద్రం.

ADVERTISEMENT

మిగతా 1445.89 కోట్లు ఎప్పుడు విదిలిస్తారో ఎవరికీ తెలియని మిస్టరీ. మరోవైపు విభజన అనంతరం రాష్ట్రం నానా అగచాట్లు పడుతూ కాలం వెళ్ళదీస్తుంది. ప్రతినెలా అప్పులతో బండి లాగుతూ జీతాలూ పెన్షన్లు ఇవ్వడానికి కూడా కష్ట పడుతుంది. అయినా ఢిల్లీ లో ఉన్నవారి మనసు కరగడం లేదని చెప్పాలి.

మరోవైపు రాజధాని, పోలవరం రూపం మరో రెండు అతిపెద్ద ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతుంది. అయితే కేంద్రంతో పెట్టుకుంటే పరిస్థితిలు మరింత దిగజారతాయి అని తెలిసిన చంద్రబాబు తన పాలనా అనుభవంతో ఏదో రకంగా బండి నడిపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories