Asaduddin Owaisi - Bandi Sanjay Kumarజీహెచ్ఎంసి ఎన్నికలు ప్రజలకు అవసరమైన వాటి గురించి కంటే ఉద్రేకాన్ని గురి చేసే అంశాలే పార్టీలు ఎక్కువగా మాట్లాడుతున్నాయి. హిందూ ముస్లిం… పాకిస్తాన్…. తరువాత తాజాగా పీవీ, ఎన్టీఆర్లను కూడా ఈ రచ్చకు ఈడ్చేశారు. తాము తెరాస దోస్తులం కాదు అని చెప్పుకోవడానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారని.. అలా అయితే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని డిమాండ్ చేశారు. దానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు.

“ఎన్టీఆర్, పీవీ సమాధులను కూలిస్తా అన్నాడట ఓవైసీ.. దమ్ముంటే కూల్చరా… నీ దారుసలేం భవనాన్ని క్షణాల్లో కొల్చేస్తారు మా కార్యకర్తలు,” అని జూనియర్ ఒవైసికి వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. అసలు ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఏ విధంగా ప్రజలకు అవసరం?

ప్రజలను ఇబ్బంది పెడుతున్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి విషయాల గురించి మాట్లాడకుండా ఎన్నికలను ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇక్కడ విశేషం ఏమిటంటే… సహజంగా ఇటువంటి అంశాలు వెతుక్కునే తెరాస మాత్రం ఈ సారి వాటి జోలికి పోకుండా అభివృద్ధి, సంక్షేమం అంటూ కొత్త పంథా తీసుకోవడం.