ఆసియా కప్ లో భారత్ పాల్గొనబోతుంది అనే వార్త బయటకు వచ్చిన క్షణం నుండి ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. కొందరు, ఆటలను-రాజీకీయాలను కలపకూడదు అని భారత్-పాక్ మ్యాచ్ కు మద్దతు ఇవ్వగా, మరి కొందరు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ జరగకూడదని తమ వ్యాఖ్యలను తీర్మానించారు.
అయితే ఏదేమైనప్పటికీ, భారత్ ఆసియా కప్ లో పాల్గొన్నది, అందరు అనుకున్నట్టు గానే పాక్ ను పసి కూన మాదిరి ఒకసారి కాదు, రెండు సార్లు ఓడించింది. అయితే, ఇక్కడే మొదలయ్యింది అసలు రచ్చ..! ఆటలో గెలుపోటములు సాధారణం అనే ఇంగితాన్ని మరిచి, దేశ సరిహద్దులో జరిగిన యుద్ధ సన్నివేశాల సంజ్ఞలతో పాక్ ఆటగాళ్లు ఏకంగా గ్రౌండ్ ని వార్ రూమ్ గా మార్చేశారు.
తొలి మ్యాచ్ లో భారత కెప్టెన్ సూర్య మరియు ఏ ఇతర భారత ఆటగాడు పాక్ ప్లేయర్స్ కు హ్యాండ్-షేక్ ఇవ్వకపోవటాన్ని పాక్ టీం తట్టుకోలేక పసిపిల్లోడి లాగా తాము ఆసియ కప్ కు బాయ్కాట్ చేస్తామంటూ అలిగి డ్రెస్సింగ్ రూమ్ లోనే కూర్చున్నారు.
అయితే, యు.ఏ.ఈ జట్టును ఓడించి పాక్ సూపర్-4 కి అడుగు పెట్టగా, అక్కడ కూడా భారత ఆటగాళ్ళ దెబ్బకు కంగు తింది. ఇక, ఈ ఓటమి అవమానాన్ని సహించలేకపోయిన కొందరు ఆటగాళ్లు తాము ఎం చేస్తున్నారో మరిచి, మైదానం లోకి చాలా సున్నితమైన, ఇరు దేశాల మధ్య భావోద్వేగాల తో మిళితమైన ఆపరేషన్ సింధూర్ ను తలపించే చేష్టలు చేసి, నెట్టింట వైరల్ అయ్యారు పాక్ ప్లేయర్.
ఇక, ఆ పై లంక మరియు బంగ్లా జట్లతో గెలిచి పాక్ ఫైనల్ కు అర్హత సాధించగా, కేవలం 2 మ్యాచ్లను ఆడిన భారత్ అప్పటికే ఫైనల్ లో బెర్తును ఖరారు చేసుకున్నారు. ఇక, ముచ్చటగా పాక్ పై భారత్ మూడవ గెలపు కు సిద్దమవుతుంది అని భారత అభిమానులు కామెంట్స్ చేయగా, ఈ మ్యాచ్ తో బదులిచ్చేస్తాం అంటూ పాక్ ధీమా వ్యక్తం చేస్తుంది.
బంగ్లా తో మ్యాచ్ లో పాక్ కు విజయం అంత సాఫీ గా ఏమి రాలేదు. చెమటోడ్చి కష్ట పడితేనే విజయం వారిని వరించింది. కానీ, ఆ గెలుపు తరువాత పాక్ కెప్టెన్ ‘ఇలాంటి మ్యాచ్ ను గెలవటం అంటే మామూలు విషయం కాదు, ఇది చాల స్పెషల్ టీమ్, మేము ఏ జట్టునైనా ఓడించగలం! ఫైనల్ లో భారత్ పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నారు. మరి, ముందు 2 మ్యాచ్లలో గెలవలేని అదే పాక్ జట్టు, 3వ సారి ఏ మేరకు భారత్ పై రాణిస్తుందని అనుకుంటున్నారు..?







