కత్తైతే ఒకే…రాయి నాట్ ఒకే, ఈస్ ఇట్ క్లియర్..!

Pawan Kalyan Public Meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ కీలక నేతల పై జరుగుతున్న దాడి ఘటనలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. గత ఎన్నికలలో జగన్ కు విశాఖలో జరిగిన కోడికత్తి ఘటనతో అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు భద్రతా ఉందా..? ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ విఫలమయ్యింది.

ADVERTISEMENT

పోలీస్, ఇంటిలిజెంట్ వ్యవస్థలు అసలు పని చేస్తున్నాయా..? దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకు ఏం సమాధానం చెపుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు.

గతంలో బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నీతులు చూపిన వైసీపీ ఇప్పుడు మాత్రం దాడులు ప్రతిపక్షాల కుట్ర అంటూ నెపం టీడీపీ పార్టీ మీద, నింద బాబు నెత్తిన వేస్తున్నారు. మొన్న విజయవాడ లో సీఎం జగన్ పైన జరిగిన గులక రాయి ఘటన, ఆ తరువాత బాబు, పవన్ ల మీద జరిగిన రాయి దాడి సంఘటనలకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అంటూ చేతులు దులుపుకోవడానికి నడుం బికించింది వైసీపీ ప్రభుత్వం.

జగన్ ను హతమార్చడానికే గులకరాయి దాడి అంటూ ఒకసారి, సింపతీ కోసం బాబు తన పై తానే దాడి చేయించుకున్నాడు అంటూ మరోసారి రెండు సంఘటనలకు బాబే కారణమంటూ వితండవాదన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు మరో సంఘటన ఎదురయ్యింది. నిన్న భీమవరం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ నిర్వహించిన వారాహి యాత్రలో అనుమానితులుగా ఉన్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా అనుమానితుల వద్ద నుండి 2 చాకులు లభ్యమయ్యాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ ఇద్దరి వ్యక్తులలో ఒకరు తన దగ్గర ఉన్న కత్తితో పోలీసుల పై దాడికి యత్నించారు. దీనితో పవన్ అభిమానులలో కలకలం రేగింది. గతంలో కూడా పవన్ తన పైన, తన భద్రతా సిబ్బంది పైన కొందరు కార్యకర్తల ముసుగులో వచ్చి బ్లేడ్లతో దాడి చేస్తున్నారు అంటూ పార్టీ సిబ్బందిని, సభలకు హాజరవుతున్న అభిమానులను అప్రమత్తంగా ఉంటాలంటూ సూచించారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు ఆయా పార్టీల నేతల అభిమానులు. జగన్ విషయంలో స్పందించినంత వేగంగా మిగిలిన నేతల పై వ్యవస్థలు స్పందిస్తున్నాయా..? అంటే అది సమాధానం చెప్పలేని ప్రశ్నగానే మిగులుతుంది. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రోగాలకు ఒకటే మందులాగా అందరి దాడుల వెనుక బాబే కారణం అంటూ ప్రచారం చేస్తూ ఇంకెన్నాళ్లు ప్రజా తీర్పు నుండి తప్పించుకుంటారో వేచి చూడాలి.

అధికారంలో ఉన్నవారు ఇలా బాధ్యత నుండి తప్పించుకుంటూ పాలకుల విలువను తగ్గిస్తున్నారు అనే భావనలోకి వైకాపా నాయకులు రానంత కాలం రాష్ట్రంలో జరుగుతున్న ఈదాడులకు ఆదే తప్ప అంతముండదు. రాష్ట్రంలో జరిగిన మంచంతా జగన్ పుణ్యమే….చెడంతా బాబు పాపమే అంటూ ‘చెప్పే వారంతా వైకాపా నాయకులే అయినా వినేవారంతా వైసీపీ కార్యకర్తలు’ కాదనేది జగన్ అండ్ కో తో పాటు బ్లూ మీడియా కూడా గ్రహించాలి.

అసలు పవన్ సభకు చాకులు తీసుకు రావాల్సిన అవసరం ఏముందో..? రాయితోనే జగన్ పై హత్యాయత్నం అంటూ ప్రచారం చేసుకుంటూ బ్లూ మీడియా, వైసీపీ నేతలు మరి కత్తుల చేసిన దాడికి ఎం బదులిస్తారు..? ఈ రాష్ట్రంలో జగన్ ప్రాణాలకు తప్ప మరెవరి ప్రాణాలకు విలువలేదా..? ఇప్పటికే సొంత చెల్లెల్లు సునీత, షర్మిల కూడా ఈ రాష్ట్రంలో తమకు భద్రతా లేదు అంటూ ఎన్నో సార్లు తమగోడు వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలకు భద్రతా కరువయ్యింది అనే అభిప్రాయం సర్వత్రా బలపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories