విజయసాయి రెడ్డి మీద దాడి కూడా భావ ప్రకటన స్వేచ్చేనా?

Attack on Vijaya Sai Reddy Canvoyవైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి మీద రామతీర్థంలో దాడి జరిగింది. అక్కడి స్థానికులు ఆయన కారు మీద చెప్పులు, రాళ్ళూ రువ్వారు. కార్ వదిలి పోలీసు భద్రత మధ్య కాలినడకన తప్పించుని వెళ్లిపోయారు ఆయన. దానితో కారు అద్దాలు పగిలిపోయాయి. అయితే ఇది చేయించింది టీడీపీ వారే అని కేసులు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు మీద ఈ విధంగానే దాడి జరిగింది. దాడి చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే అని వారే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అయితే అప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీ.జీ.పీ గౌతం సవాంగ్ వాటిని “భావ ప్రకటన స్వేచ్చ” అని సమర్దించారు.

ADVERTISEMENT

విజయసాయి రెడ్డి వంటి వారు రెడ్డి వెకిలిగా హేళన చేశారు. అప్పుడు చేసింది భావ ప్రకటన స్వేచ్చ అయితే ఇది కూడా అంతే కదా… చేసింది టీడీపీ వారైనా సామాన్యులైన కేసులు పెట్టకూడదు కదా అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాలలో హింసను సమర్దిస్తే చివరికి అదే తమ మెడకు చుట్టుకుంటుంది అనేదానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పాత్ర ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలు ఈ కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు

ADVERTISEMENT
Latest Stories