వాట్ ఎ మ్యాచ్… వాట్ ఎ ఫినిష్..!

Australia Vs New Zealand One Day Seriesఎందులోనైనా సమయస్పూర్తి చాలా ముఖ్యం. అదే ఉత్కంఠ పరిస్థితులలో అయితే మరింత ప్రాధాన్యత దక్కుతుంది. అలాంటి సమయస్పూర్తి వహించే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన జట్టుకు ఓ అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఆసీస్ తో ప్రారంభమైన వన్డే సిరీస్ లో భాగంగా, తొలి వన్డేలో తొలుత చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులు చేసింది. గుప్తిల్ (61), బ్రూమ్ (73), నీషం (48)ల బ్యాటింగ్ ప్రతిభతో ఈ మాత్రం స్కోర్ నైనా నమోదు చేయగలిగింది.

ఇక లక్ష్య చేధనలో ఆసీస్ తడబడిపోయింది. 18 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, 67కు చేరుకునే సమయానికి 6 వికెట్లను కోల్పోయి ఘోర ఓటమి దిశగా పయనిస్తోంది. అయితే స్టోనిస్ అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో దాదాపుగా గెలిచినంత పని చేసింది. 117 బంతుల్లో 146 పరుగులు చేసి కివీస్ ను గడగడలాడించాడు. మరో ఎండ్ లో ఫాల్కనర్ 25, కమ్మిన్స్ 36 చక్కని సహకారం అందించడంతో, వీరి అండగా స్టోనిస్ చెలరేగిపోయి, ఏకంగా 11 సిక్సర్లు సాధించాడు.

ADVERTISEMENT

42.6 వద్ద 9వ వికెట్ నేలకూలగా అప్పటికి 226 పరుగులు చేసింది ఆసీస్. అప్పటినుండి చివరి బ్యాట్స్ మెన్ కు కనీసం ఒక్క బంతిని కూడా ఇవ్వకుండా 4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన స్టోనిస్ 54 పరుగులు సాధించాడు. ఈ తరుణంలో ఓవర్లోని ప్రతి చివరి బంతిని సింగిల్ కొడుతున్న స్టోనిస్ ను కట్టడి చేసేందుకు కెప్టెన్ విలియమ్సన్ పన్నిన వ్యూహం సత్ఫలితాన్ని ఇచ్చింది. సింగిల్ కోసం స్టోనిస్ కొట్టిన స్ట్రెయిట్ షాట్ నేరుగా విలియమ్సన్ చేతుల్లోకి వెళ్ళగా, అక్కడ ఫీల్డర్ ను గమనించని హజెల్ వుడ్ కొద్దిగా ముందుకు వెళ్ళడంతో, ఈ లోపు వికెట్లను ఎగరగొట్టాడు కివీస్ కెప్టెన్.

దాదాపుగా 26 నిముషాలు క్రీజులో ఉన్నా, హజెల్ వుడ్ కనీసం ఒక్క బంతిని కూడా ఆడలేదంటే, స్టోనిస్ ఏ రేంజ్ విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ రనౌట్ తో 47 పరుగుల వద్ద ఆసీస్ 280 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడు ఓవర్లలో కేవలం 7 పరుగులే చేయాల్సి ఉన్నా, చేతిలో వికెట్లు లేకపోవడంతో పరాజయం పాలవ్వక తప్పలేదు. అంత ఒత్తిడిలోనూ సమయస్పూర్తిని ప్రదర్శించి, న్యూజిలాండ్ కు మంచి విజయాన్ని అందించి, సిరీస్ లో 1-0తో ముందంజ వేసేలా చూసాడు విలియమ్సన్.

ADVERTISEMENT
Latest Stories