సిగ్గు, ఎగ్గు లేని ఆస్ట్రేలియా జట్టు తీరు!

Australian cicketer Cameron Bancroft ball tamperingవివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆస్ట్రేలియా జట్టు ఈసారి బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ మైదానంలో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పసుపు రంగు చిప్ లాంటి పరికరంతో బంతి ఆకారాన్ని మారుస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు.

దీనిని గమనించిన అంపైర్లు వివరణ కోరగా అతడు ప్యాంటు జేబులోంచి కళ్లద్దాలు పెట్టుకునే సంచిని తీసి చూపించి అమాయకుడిలా వెళ్లిపోయాడు. దీంతో తర్వాత తిరిగి ఆటను కొనసాగించినప్పటికీ, అతడు మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా బాల్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నట్టు పదే పదే టీవీల్లో ప్రసారం కావడంతో అది కాస్తా సోషల్ మీడియాకెక్కి, క్షణాల్లోనే వైరల్ అయింది.

ADVERTISEMENT

బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెటర్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. డేల్ స్టెయిన్, షేన్‌వార్న్, ఆడమ్ కోలిన్స్, సిమన్ హార్మర్ వంటి వాళ్లు ఆసీస్ తీరును ఎండగట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక ఇరుక్కుపోయిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ రంగంలోకి దిగి, బాల్‌ను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించినట్టు నిర్లజ్జగా అంగీకరించాడు. రంగంలోకి దిగిన ఐసీసీ బాన్‌క్రాఫ్ట్‌పై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించింది.

Australian cicketer Cameron Bancroft ball tampering

ADVERTISEMENT
Latest Stories