నవంబర్ -1 ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇక్కడ అధికార పార్టీ ఓట్ చోరీకి పాల్పడుతుందని, సర్ ప్రక్రియ అందులో భాగమే అని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో రాహుల్ తన నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చారు.
తన ఈ నిరసనతో ఎన్డీయే ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి జ్ఞానేశ్ కుమార్ ను రాజీనామా చేయించగలిగితే అది మోడీ మీద రాహుల్ సాధించిన తొలి రాజకీయ విజయంగా మారుతుంది. ఆ విజయం రేపు రాబోయే ఎన్నికల్లో ఇండి కూటమికి రాహుల్ నాయకత్వాన్ని బలపరిచినట్టే అవుతుంది.
దీనితో ఎలా అయినా నవంబర్ -1 న జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రపక్షాలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాహుల్ తన రాజకీయ బలం ఎంత అనేది ఎన్డీయే కు ముఖ్యంగా బీజేపీ పార్టీకి తెలియచెప్పాలని భావిస్తున్నారు.
అలాగే ఇటు బీజేపీ సైతం తన అధికారం బలం ఎలా పనిచేస్తుందో కాంగ్రెస్ కి ఇండి కూటమికి రుచి రూపించేందుకు సిద్దమయ్యింది. ఢిల్లీలో రాహుల్ పిలుపిచ్చిన నిరసన కార్యక్రమాలలో ఎటువంటి అల్లర్లు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసేందుకు, ఆ నిరసన కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యం లేకుండా ఉండేందుకు,
ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకునే కాంగ్రెస్ శ్రేణులను నిలువరించి రాహుల్ బలప్రదర్శనకు బ్రేకులు వేయడానికి బీజేపీ కూడా తన రాజకీయం తానూ చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం రాహుల్ కి ఎంత అవసరమో, అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ కాకపోవడం బీజేపీ కి అంతకంటే ముఖ్యం.
ఇప్పటికే సీజేపీ ఒత్తిడితో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా తో బీజేపీ ఒక అడుగు వెనక్కి వేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ డిమాండ్ తో సీఈసీ రాజీనామా కూడా జరిగితే అది బీజేపీ కి పెద్ద కోలుకోలేని రాజకీయ ఎదురుదెబ్బగా మారుతుంది. దాని ఫలితం రాబోయే జాతీయ ఎన్నికల మీద స్పష్టంగా పడుతుంది.
అలాగే ఆ ఇంపాక్ట్ ప్రధాని నరేంద్ర మోడీ పొలిటికల్ ఛరిష్మా కు కూడా ఒక మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి నవంబర్ – 1 ఢిల్లీ నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి బలప్రదర్శనగా, బీజేపీ కి బల పరీక్షగా నిలవనుంది.





