ఒక్క క్యాచ్..రెండు మ్యాచ్లు..!

Axar Patel Catches

2024 టి-20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకోవటం వెనుక బుమ్రా, అర్షదీప్, హార్దిక్ వంటి బౌలర్ల తో పాటు రోహిత్ శర్మ యొక్క అద్భుతమైన కెప్టెన్సీ ముఖ్య పాత్రలు పోషించాయి. కానీ, ఆ విజయం గురించి ఆలోచించగానే మదిలో మొదట మెదిలే చిత్రం-‘సూర్య కుమార్ లాంగ్-ఆఫ్ క్యాచ్!’

అదే క్యాచ్లకు ఉన్న విలువ. బౌలింగ్, బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ ఎంత గొప్పగా చేసినప్పటికీ, ఒక్క అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ నే మలుపుతిప్పేస్తుంది. ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని అంటారు క్రికెట్ పెద్దలు. ఈ మాటకు సూర్య క్యాచ్ ఒక నిదర్శనం. నేడు సూర్య కు ఏ మాత్రం తీసిపోని క్యాచేస్ తో అక్షర్ పటేల్ క్యాచెస్ విలువను మరొకసారి గుర్తుచేశాడు.

ADVERTISEMENT

సరిగ్గా చూసినట్లయితే ఈ టి-20 వరల్డ్ కప్ మొదలయిన రోజు నుండి, భారత్ కు అత్యంత తక్కువ క్యాచింగ్ ఎఫీషియెన్సీ ఉంది. వచ్చిన క్యాచెస్ అన్నిట్లో కేవలం 75% ను మాత్రమే వికెట్స్ గా మలిచింది టీం ఇండియా ఫీల్డింగ్. ఇదే ఈ టోర్నీ లో అత్యంత తక్కువైనా గణాంకం.

మరి ఇలాంటి ఫీల్డింగ్ పటిమ తో భారత్ కు ఇంపార్టెంట్ మ్యాచ్లలో ఇబ్బంది ఎదురవుతుందని అందరు జాగ్రత్త చెప్పగా, మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ తమ ముందుకు వచ్చే సరికి టీం ఇండియా ఫీల్డింగ్ గాడిన పడింది. ముఖ్యం అక్షర్ పటేల్ రెండు అబ్బురపరిచే క్యాచులను అందుకుని మ్యాచ్ ను గెలవటంలో ముఖ్య పాత్ర పోషించాడు.

తొలుత బ్యాటింగ్ చేసి 253 భారీ స్కోరును ఇంగ్లాండ్ ముందుంచిన భారత్ కు 2వ ఇన్నింగ్స్ పవర్-ప్లే లో బుమ్రా వేసిన మొదటి బంతి చాలా నెమ్మదిగా వదిలిన వేల, ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ పూర్తిగా బోల్తా పడి ఒక హాఫ్-హార్టెడ్ షాట్ ఆడగా, పవర్-ప్లే కాబట్టి బౌండరీ వెళుతుందనుకున్నారు అందరు.

కానీ అక్షర్ పటేల్ ఏకంగా 25 మీటర్లు రివర్స్ లో పరిగెడుతూ ఒక అద్భుతమైన క్యాచ్ ను పట్టుకున్నాడు. ఇక, ఆ వికెట్ కోల్పోయాక బెథెల్-జాక్స్ భాగస్వామ్యం మరింత ప్రమాదకరంగా మారే సమయంలో అర్షదీప్ వేసిన ఒక వైడ్ ఫుల్-టాస్ ను జాక్స్ బాక్వర్డ్-పాయింట్ దిశగా కొత్తగా, బౌండరీ లైన్ వద్ద అక్షర్ కళ్ళు చెదిరే క్యాచ్ ను పట్టి మరొక భారీ వికెట్ లో కీలక పాత్ర పోషించాడు.

దీనితో టెక్నికల్ గా ఆ వికెట్ బౌలర్ ఖాతాలోకి వెళ్లినప్పటికీ క్రికెట్ అభిమానుల దృష్టిలో ఆ వికెట్ అక్షర్ చేతిలోకి వచ్చినట్లయ్యింది. ఇలా నాడు సూర్య క్యాచ్ భారత్ కి 2024 టి -20 వరల్డ్ కప్ అందిస్తే, నేడు అక్షర్ క్యాచ్ 2026 టి – 20 ఫైనల్ కి అర్హత సాధించింది.

ఇలా, టోర్నీ మొదటినుండి క్యాచింగ్ పై అనేక సందేహాలు ఉన్న టీం ఇండియా, అత్యవసరమైన సమయంలో సమిష్టిగా రాణించి సెమి-ఫైనల్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి న్యూజిలాండ్ తో ఫైనల్స్ కు అర్హత సాధించారు. చూడాలి మరి, హై-ప్రెషర్ మ్యాచ్లో టీం ఇండియా ఫీల్డింగ్ ఎంత వరుకు రాణిస్తుందో అని..?

ADVERTISEMENT
Latest Stories