మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!

Baahubali 2 Saahore Song 100 million views‘బాహుబలి’కి బలమైన కథా కథనాలు .. రాజమౌళి దర్శక ప్రతిభ .. నేపథ్య సంగీతం .. ముఖ్య పాత్రధారులందరూ పాత్రల్లో ఇమిడిపోయిన తీరు .. ఫోటోగ్రఫీ ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. ఇక ‘సాహోరే బాహుబలి’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ను కూడా వీటి సరసన చేర్చవచ్చు. సంగీతం .. సాహిత్యం .. చిత్రీకరణ పరంగా ఈ పాట ప్రేక్షకులను కథలోకి .. పాత్రల మధ్యలోకి తీసుకెళ్లింది.

ADVERTISEMENT

ఒక్క మాటలో చెప్పాలంటే మనసు మనసును ఈ పాట మంత్రించి వేసింది. అలాంటి ఈ వీడియో పాట యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ‘లహరి’ మ్యుజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాటను 86 మిలియన్ల మంది వీక్షించగా, దిల్ రాజు యూట్యూబ్ ఛానల్ ద్వారా 18 మిలియన్ల మంది చూశారు. మొత్తానికి ‘బాహుబలి’ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుందన్న మాట.

ADVERTISEMENT
Latest Stories