“బాహుబలి – ది కన్ క్లూజన్” ట్రైలర్ రెడీ… గెట్ రెడీ ఫ్యాన్స్..!

Baahubali-2-The-Conclusion-Trailer-Readyప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కావడానికి ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు నెలకొనగా, వాటిని రెట్టింపు చేసే విధంగా ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ఉంటుందని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మార్చి నెలలో ఈ ట్రైలర్ ను విడుదల చేస్తామని దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే స్పష్టం చేయడంతో, ఆ అధికారిక డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ రెడీ అయ్యిందని, ప్రస్తుతం ఇది వెండితెరపై ఎలా ఉంటుందో అన్న విషయాన్ని పరీక్షిస్తున్నామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేసారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో ఈ ట్రైలర్ తయారైందని చెబుతూ, దీన్ని పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు సెంథిల్. ఈ సినిమాపై సీవీ రావు, శివకుమార్ లతో కలసి వర్క్ చేస్తున్నామని చెప్పగా, తాజా సమాచారం మేరకు మరో 10 రోజుల్లో ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories