“బాహుబలి 2” ట్రైలర్ – ఒక్క రోజులో 2 కోట్ల క్లిక్స్!

Baahubali 2 Trailer Clicksయూ ట్యూబ్ లో ఆకాశమే హద్దుగా “బాహుబలి 2” ధియేటిరికల్ ట్రైలర్ దూసుకుపోతోంది. ఇంతకుముందెన్నడూ చవిచూడని రికార్డులను ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తోంది. దేశం మొత్తం ఈ సినిమా విడుదలకు ఎదురు చూస్తోందన్న విషయం తెలుసు గానీ, మరీ ఇంత ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురు చూస్తోందని మాత్రం, ఈ ట్రైలర్ విడుదలైన తర్వాతే తెలిసి వచ్చింది. ప్రస్తుతం ‘బాహుబలి 2’ ట్రైలర్ యూ ట్యూబ్ లో భూకంపం సృష్టిస్తూ… ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఉన్న రికార్డులనన్నింటిని తుడిచిపెడుతోంది.

గురువారం నాడు ఉదయం 10 గంటల సమయంలో విడుదలైన ఈ ట్రైలర్, కేవలం 8 గంటలలోపే 10 మిలియన్ అంటే 1 కోటి క్లిక్స్ ను అందుకుని, ‘బాహుబలి 2’కున్న క్రేజ్ ఏంటో చాటిచెప్పింది. భారతీయ సినిమాలలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి రికార్డులు నమోదు కాలేదు. కోటి క్లిక్స్ ను అందుకున్న టీజర్లు, ట్రైలర్లు చాలా ఉన్నాయి గానీ, కేవలం ఒక్క రోజు లోపే ఈ రికార్డులను అందుకున్నవి మాత్రం లేవనే చెప్పాలి. అయితే ఇది కేవలం 8 గంటలలో ప్రేక్షకులు చూపించిన ప్రభంజనం.

ADVERTISEMENT

మరి 24 గంటలు గడిచే పాటికి “బాహుబలి 2” ట్రైలర్ సునామీ ఏ స్థాయిలో ఉండబోతుంది? అంటే ఖచ్చితంగా 20 మిలియన్ అంటే 2 కోట్ల క్లిక్స్ ను అందుకోవడం ఖాయంగా కనపడుతోంది. నిజానికి యూ ట్యూబ్ రికార్డులను కొల్లగొడుతుందని ముందుగా ఊహించిన విషయమే గానీ, మరి ఫస్ట్ డేనే మొత్తం తుడిచిపెట్టి వేస్తుందని మాత్రం అంచనాలకు అందనిది. ఇది కూడా కేవలం తెలుగు భాషకు సంబంధించిన ట్రైలర్ క్లిక్స్ మాత్రమే. జాతీయ భాష అయిన హిందీలో ఇప్పటివరకు 5 మిలియన్ క్లిక్స్ అందుకోగా, తమిళంలో 1 మిలియన్, మలయాళంలో హాఫ్ మిలియన్ క్లిక్స్ ను దాటింది.

నిజంగా ఒక తెలుగు సినిమా ట్రైలర్ కు కేవలం 8 గంటలలో కోటి మంది క్లిక్స్ వచ్చాయంటే సాధారణ విషయం కాదు, అనితర సాధ్యం… అమోఘం..! బహుశా ఇప్పట్లోనే కాదు, మళ్ళీ రాజమౌళి ఏ మహాభారతమో తీసే వరకు ఈ “బాహుబలి 2” రికార్డులు పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఒక తెలుగు సినిమాగా “బాహుబలి 2” సాధిస్తున్న రికార్డులను చూసి, దీనిని సృష్టించిన రాజమౌళిని చూస్తూ గర్వపడుతూ ప్రతి తెలుగు వారు ఆనందిద్దాం.

ADVERTISEMENT
Latest Stories