వద్దంటున్న ప్రభాస్… వెంటపడుతున్న ఫ్యాన్స్..!

Baahubali Prabhas At Airport Viral‘డార్లింగ్’ ప్రభాస్ కు ‘బాహుబలి’ సినిమా తర్వాత క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఎక్కడ కనపడినా సందడి వాతావరణమే నెలకొంటోంది. ఆడియో ఫంక్షన్లు, ఇతర వేడుకలకు ప్రభాస్ హాజరైన సందర్భంలో ఈ ఆరడుగుల అందగాడిని చూసేందుకు, ఆటో గ్రాఫ్స్ తీసుకునేందుకు, అలాగే ఓ సెల్ఫీ దిగేందుకు అభిమానులు కనపరుస్తున్న ఉత్సాహం చూస్తూనే ఉన్నాం.

తాజాగా, చెన్నై ఎయిర్ పోర్టులో ప్రభాస్ వెంట లేడీ ఫ్యాన్స్ పడ్డారు. ప్రభాస్ తన సన్నిహితులతో వెళుతుండగా, కొంత మంది అమ్మాయిలు ప్రభాస్ ను గుర్తించారు. అంతే… యంగ్ రెబల్ స్టార్ తో కలిసి ఒక సెల్ఫీ అయినా దిగుదామనే ఉద్దేశంతో ప్రభాస్ వెనుక పడ్డారు. చివరికి ప్రభాస్ తో వాళ్లు సెల్ఫీ దిగారో? లేదో? తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories