టీజర్ టాక్ – ఈ ‘బాబు’ పాపలతో బాగా బిజీ!

Babu Baga Busyl Teaser Talkబాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “హంటర్” సినిమాను తెలుగులో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో “బాబు బాగా బిజీ” అన్న పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ గా నిలిచిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సినిమాకు తగ్గట్టుగా డబుల్ మీనింగ్ తో ఇటీవలే విడుదల చేయగా, వీక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాగా, తాజాగా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిత్ర యూనిట్.

బాలీవుడ్ ‘హంటర్’ సినిమా చూసిన వారికి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న విషయం తెలిసిపోతుంది గానీ, ఆ సినిమాను వీక్షంచని వారికి మాత్రం సరికొత్త కిక్ ని పంచనుందన్న సంకేతాలు టీజర్ ఇచ్చేసింది. టైటిల్ కు తగిన విధంగానే అవసరాలను బాగా బిజీ పనుల్లో చూపించారు దర్శకులు నవీన్. ‘చిన్నదాన నీ కోసం’ సినిమా ఫేం మిస్తీ, ‘ఐస్ క్రీం’ బేబీ తేజస్వి, ‘పటాస్’ పాప శ్రీముఖి వంటి భామలు కన్నులవిందు చేయనున్నారు.

ADVERTISEMENT

‘ఆర్ యు వర్జిన్’ అన్న లేడీ డైలాగ్ కు ‘అదెప్పుడో పదిహేనేళ్ళ క్రితం’ అంటూ అవసరాల చెప్పిన డైలాగ్ తో, తాము ఈ సినిమా ఏం చూపించబోతున్నారో చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది. టీజర్ గురించి ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories