వైరల్ – ఇది గోగినేని వారి సవాల్!

Babu Goginei challenges Black magicదేవుళ్ళు, దెయ్యాలు, మూడ నమ్మకాలు… అనే కాన్సెప్ట్ సైన్సుకు విరుద్ధం అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వాటిపై జన విజ్ఞాన వేదిక సభ్యులు మరియు గోగినేని బాబు లాంటి వారు మీడియాలలో వివిధ సందర్భాలలో ‘లైవ్ షో’లను కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఏర్పడిన చంద్రగ్రహణం సందర్భంలో కూడా మీడియాలో కూర్చుని ఫలహారాలు సేవిస్తూ… ఇవన్నీ మూఢవిశ్వాసాలని కొట్టిపారేసారు.

ADVERTISEMENT

తాజాగా జరిగిన నరబలి నేపధ్యంలో… ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న గోగినేని బాబు, సదరు షోలో ఓ ఛాలెంజ్ విసిరారు. ఎదురుగా ఉన్న తాత్వికవేత్తతో… ఇదిగో నా వెంట్రుక చేయండి చేతబడి నాకు, నా చొక్కా, గోర్లు కూడా ఇస్తాను… మీ మంత్రంతో చేయండి లేక ఆ తంత్రంతో చేయండి… ఏదైనా చేయండి… ఇక డిస్కషన్లు ఆపండి… అంటూ ఛాలెంజ్ విసిరారు.

సినీ ఫక్కీలో ఈ డైలాగ్ లు చెప్పడంతో… ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో నెట్టింట ‘గోగినేని సవాల్ బొమ్మ’ వైరల్ అవుతోంది. మూఢ విశ్వాసాల బాటలో పయనిస్తూ… మనిషిని మనిషే చంపుకుంటున్న నేటి రోజుల్లో… నిజంగానే గోగినేని సవాల్ ను స్వీకరించి ప్రజలకు కనువిప్పు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న భావన వీక్షకులలో కలుగుతుంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో హంగామా చేయడానికి తప్ప, వీటిని సీరియస్ గా ఎవరూ తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories