శ్రీకాకుళం జిల్లాలో ఓ పక్క చాలా జోరుగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంటే మరోపక్క బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లాలో సుభద్రాపురంలో మాజీ సర్పంచ్ కుజ్జ తాతయ్య, ఐ-టిడీపీ సమన్వయకర్త బి.బాలకృష్ణల అధ్వర్యంలో గురువారం జోరుగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. దీనిలో స్థానిక టిడిపి కార్యకర్తలు మల్లేశ్వరరావు, బి.భవానీ ప్రసాద్, కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో కంచిలి మండలం చిన్న కొజ్జిరియా పంచాయతీ పరిధిలో చిన్న కొజ్జిరియా,చంద్రుపుట్టుగ గ్రామాలలో స్థానిక టిడిపి నేతలు బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి జగన్ ప్రభుత్వం ఏవిదంగా అప్పులు చేసి ఆ భారం ప్రజలపై రుద్దుతోందో వివరించారు.
జిల్లాలో నరసన్నపేట పట్టణంలోని కళింగ కోమట్ల సంఘం అధ్యక్షుడు ఉణ్ణ వేంకటేశ్వర రావు, టిడిపి నాయకులు బోయన ఆనంద్, సతీష్ తదితరులు గురువారం టిడిపి రాష్ట్ర బీసీ కమిటీ కన్వీనర్‌గా నియమితులైన బోయన గోవిందరాజులును కలిసి అభినందనలు తెలిపారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు తమను ఓబీసీలో చేర్చేందుకు చాలా కృషి చేస్తున్నారని తెలిపారు. తామందరం వచ్చే ఎన్నికలలో టిడిపికే మద్దతు ఇస్తామని తెలిపారు.
కోట బొమ్మాళి మండలంలో టిడిపి నాయకులు వెలమల విజయలక్ష్మి కామేశ్వర రావు, తర్రా రామకృష్ణ, సంపతిరావు రాజు, కర్రీ అప్పారావు, పూజారి శైలజ, గోండు లక్ష్మణ రావు, సాసుమంతు ఆనందరావు, కోరాడ గోవిందరావు, లయార్ అచ్చెనాయుడు, కర్రీ అప్పారావు తదితరులు టిడిపి మండలాధ్యక్షుడు బోయిన రమేష్ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. టిడిపి నేతలు ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని కోరుకొన్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన టిడిపి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.



