‘షారుక్’కు షాకిచ్చిన ‘బాజీరావు!’ కలెక్షన్స్ లో ఆధిపత్యం!

bajirao mastani crossed dilwale collectionsబాలీవుడ్ కింగ్ ఖాన్ నటించిన “దిల్ వాలే” చిత్రం తొలి మూడు రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్లును కొల్లగొట్టి మంచి ఊపులో దూసుకెళ్తున్నట్లు కనిపించింది. అయితే నాలుగవ రోజైన సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్స్ భారీ స్థాయిలో పడిపోయాయి. మరో వైపు “బాజీరావు మస్తానీ” మాత్రం సోమవారం నాడు షారుక్ సినిమా కలెక్షన్స్ ను దాటేసి, కింగ్ ఖాన్ కు జలక్కే ఇచ్చాడు.

తొలి 4 రోజులకు ఇండియాలో కలెక్షన్స్ ను పరిశీలిస్తే… షారుక్ “దిల్ వాలే” 75.18 కోట్లు కైవసం చేసుకోగా, “బాజీరావు మస్తానీ” 57.02 కోట్లు కొల్లగొట్టింది. అయితే, షారుక్ సినిమా వసూళ్ళు డౌన్ ట్రెండ్ లో కొనసాగుతుండగా, రన్వీర్ సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా వుంది. షారుక్ సినిమా వల్ల బాజీరావుకు దెబ్బ పడుతుందని అంచనా వేసిన ట్రేడ్ విశ్లేషకులకు షాకిచ్చే ప్రేక్షకుల తీర్పు వుండటం విశేషం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories