‘బాలకృష్ణ – మహేష్’ల మల్టీస్టారర్ పై నిగ్గుతేలిన నిజం!

Balayya, balaih, Mahesh, Mahesh babu, SS rajamouli, multi starer, Joke, satire, TFI, Telugu movie, tollyuwood, telugu movie newsగత రెండు రోజులుగా వెబ్ మరియు సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త ప్రచారంలో ఉంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని, విజయేంద్రప్రసాద్ అందించనున్న ఈ కధను ప్రముఖ నిర్మాత కే ఎల్ నారాయణ నిర్మించనున్నారనేది ఈ వార్తల ఆంతర్యం.

ADVERTISEMENT

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని నిర్మాత వర్గీయుల నుండి బయటకు వచ్చిన సమాచారం. నిర్మాత కేఎల్ నారాయణ అసలు బాలకృష్ణను సంప్రదించలేదని, మల్టీస్టారర్ గా తెరకేక్కుతోందన్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి పుకార్లను సినీ అభిమానులు ఎవరూ విశ్వసించవద్దని నిర్మాత సన్నిహితుల నుండి సమాచారం వెలువడినట్లుగా ఒక ఆంగ్ల దినపత్రిక కధనాన్ని ప్రచురించింది.

దీంతో సంచలనాత్మకంగా మారిన బాలయ్య – మహేష్ ల మల్టీస్టారర్ పై పూర్తి స్పష్టత వచ్చేసినట్లే! సాధారణంగా ఇలాంటి పుకార్లు ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి గానీ, రాజమౌళి – మహేష్ – కేఎల్ నారాయణ కాంభినేషన్లో ఇప్పటికే ఒక సినిమా రాజమౌళి, మహేష్ ల నుండి ప్రకటన రావడంతో ఈ పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. కానీ, ఈ ప్రాజెక్ట్ కు బాలయ్యకు సంబంధం లేదని ధృవీకరణ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories