పిక్ టాక్ : “శ్రీమంతుడు” ఆయుధాన్ని చేపట్టిన “డిక్టేటర్”

balakrishna dictator poster and srimanthudu posterనందమూరి నటసింహం 99వ చిత్రం “డిక్టేటర్” విడుదలకు రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజా పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన “డిక్టేటర్” పోస్టర్ చర్చనీయాంశమైంది.

ఈ పోస్టర్ బాలయ్య బాబు పట్టుకున్న ఆయుధం “శ్రీమంతుడు” సినిమా చివరి పోరాట సన్నివేశంలో మహేష్ బాబు పట్టుకున్న ఆయుధం ఒకటేనంటూ వెబ్ మీడియా వెలికితీసింది. అలాగే బాలయ్య బాబు నిల్చున్న విధానం కూడా అచ్చం మహేష్ మాదిరే ఉందంటూ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను పక్కపక్కన పెట్టి మరీ సమీక్షలు జరుపుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఇలా సినిమాల్లోని స్టిల్స్ మ్యాచ్ అవ్వడం సర్వసాధారణమే కాబట్టి దీనిని ‘లైట్’గా తీసుకోమంటున్నారు నెటిజన్లు. మొత్తానికి బాలయ్య కూడా “డిక్టేటర్” ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసారు.

ADVERTISEMENT
Latest Stories