త్వరలో ‘మల్టీస్టారర్’ సినిమా… ‘హీరో’ ఎవరో చెప్పనన్న బాలకృష్ణ..!

Balakrisha Next Movie Multistar With Star Heroఒకప్పటి అగ్ర హీరోలలో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున తమ తదుపరి జనరేషన్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించారు. అయితే చిరు రీ ఎంట్రీ ఇటీవలే ఇవ్వగా, బాలయ్య మాత్రం ఇప్పటికీ సోలో హీరోగానే కొనసాగుతున్నారు. అయితే త్వరలోనే తానూ కూడా ఈ మల్టీస్టారర్ క్లబ్ లో చేరతాను అంటున్నారు నందమూరి నటసింహం.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో… “మల్టీస్టారర్ సినిమాలు నాకు చేయాలనే ఉంది, త్వరలోనే చేస్తాను, ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి, అయితే మామూలుగా కాకుండా పౌరాణికంలో ఈ సినిమా చేస్తాను, ఏ హీరో అన్న విషయం ఇప్పుడే చెప్పను గానీ, ఖచ్చితంగా చేస్తాను” అని బాలకృష్ణ చేసిన స్పష్టమైన వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహానికి కారణమవుతున్నాయి.

ADVERTISEMENT

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అందించిన చారిత్రాత్మక విజయంతో సంతోషంగా ఉన్న అభిమానులకు బాలయ్య ‘డబుల్ బొనంజా’ ఇచ్చినట్లయ్యింది. మల్టీస్టారర్ సినిమా మాత్రమే కాదు, అది పౌరాణికం అంటూ చెప్పిన మాటలు అభిమానులను ఆనందదాయకం చేస్తున్నాయి. ఇదే కార్యరూపం దాలిస్తే… అది ‘శాతకర్ణి’ సినిమాకు మించిన విజయాన్ని అందించడం ఖాయం అంటున్నారు అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories