తన అభిమాని మాజీ కార్పొరేటర్ భానుప్రకాశ్ కు హైదర్ నగర్ టీడీపీ కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేస్తే దానికి జవాబివ్వలేదని తెలుస్తోంది. ఆపై పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే సెల్ నుంచి ఫోన్ చేయగా, గాంధీ లిఫ్ట్ చేశారని, దీంతో ఆగ్రహానికి గురైన బాలయ్య, తనదైన శైలిలో క్లాస్ పీకారని రాజకీయ, మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తున్న సమాచారం.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు భానుప్రకాశ్ సరిగ్గా సహకరించలేదని, నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలతోనూ భానుప్రకాష్ కు సత్సంబంధాలు లేవని సర్దిచెప్పేందుకు గాంధీ ప్రయత్నించగా, బాలయ్య మాత్రం అవేమి పట్టించుకోకుండా, భానుప్రకాష్ కు టికెట్ ఇవ్వాలని ఆదేశిస్తూ ఫోన్ పెట్టేసారట. సదరు సమాచారమంతా వెబ్ మీడియాలో సందడి చేస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT





