సీనియర్ హీరోలకు ఈ మధ్య కాలంలో హీరోయిన్లు దొరకడం కష్టం అవుతుంది. చిరంజీవి నుండి వెంకటేష్ వరకు ఈ ఇబ్బంది ఉంటూనే ఉంది. స్పీడ్ గా సినిమాలు చెయ్యడం వల్ల బాలయ్యకు ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంది. తాజగా బోయపాటి శ్రీనుతో ఆయన తదుపరి చిత్రం కోసం హీరోయిన్ల వేట మొదలయ్యింది.
మొన్న ఆ మధ్య బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కంఫర్మ్ అయ్యిందని వార్తలు వచ్చినా దాంట్లో నిజం లేదని తేలిపోయింది. అయితే సెకండ్ హీరోయిన్ గా మాత్రం కేథరిన్ ని తీసుకున్నారు. అయితే అది కూడా తేలికగా జరగలేదంట. కేథరిన్ ప్లాప్ హీరోయిన్… ఇప్పుడు చేతిలో ఆఫర్లు కూడా లేవు. అయినా ఈ అమ్మడు ఈ చిత్రం కోసం కోటి అడిగిందట.
అయితే బేరం ఎనభై లక్షలకు తెగ్గొట్టారట. ఎనభై లక్షలైనా కూడా ఆ భామకు కేరీర్ లోనే అతి పెద్ద రెమ్యూనరేషన్ ఇదే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి.
ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి. 2020 వేసవి చివరి భాగంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.





