‘అభిమానుల’పై స్పందించిన ‘నందమూరి’ నటసింహం!

Balakrishna staright forward comments on fansనందమూరి నటసింహం నటిస్తున్న తాజా చిత్రం “డిక్టేటర్” సంక్రాంతి పర్వదినాన జనవరి 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం పురస్కరించుకుని ఈ సినిమా పబ్లిసిటీని ప్రారంభించారు బాలకృష్ణ. టీవీ ఛానెల్స్ కు ఇచ్చిన పలు ఇంటర్వ్యూ లలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు బాలయ్య బాబు.

“పైరసీని నేనస్సలు పట్టించుకోనని, నా సినిమాను పైరసీ ప్రింట్ లో చూసి ఎంజాయ్ చేయాలని నా అభిమానులు కోరుకోరని, వారు ధియేటర్లకు వచ్చి గోల గోల చేస్తూ చూడటం అలవాటని, మల్టీప్లెక్స్ లలో కూడా విజిల్స్, కాగితాలు చింపి ఎగురవేయడాలు, డబ్బులు పైకి వేయడాలు చేసేది ఒక్క నా అభిమానులు మాత్రమేనని, ఆ వొరవడిని పరిచయం చేసింది కూడా నా సినిమాలేనని, ‘సింహ, లెజెండ్’ వంటి చిత్రాలకు మల్టీఫ్లెక్స్ లలో ఇలాంటి అనుభూతులను తానూ చూశానని, వారికి అదే ఎంజాయ్ మెంట్, అలాంటి వారే నా అభిమానులు” అని నందమూరి అభిమాన సందోహం గురించి “డిక్టేటర్” చెప్పుకొచ్చారు.

అభిమానులపై ఇంతలా స్పందించిన నందమూరి బుల్లోడు… “డిక్టేటర్” సినిమా విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. దర్శకుడు శ్రీవాస్ తనకు చెప్పిన దాని కంటే సినిమాను బాగా తెరకెక్కించారని, ఇటీవల డబ్బింగ్ చెప్తున్న సమయంలో సినిమా విజయం పట్ల పూర్తి నమ్మకం కలిగిందని, ‘బ్యూరో క్రాట్స్’ ప్రధానంగా ఈ సినిమా కధ సాగుతుందని చెప్పారు బాలకృష్ణ.

ADVERTISEMENT
Latest Stories