బాలయ్య 100వ సినిమా టీజర్ న్యూస్!

gautamiputra-satakarni-movie-teaserక్రిష్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న “గౌతమీపుత్రశాతకర్ణి” సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలున్న విషయం తెలిసిందే. దేశవిదేశాలలోని పలు చారిత్రాత్మక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన స్పందన రావడంతో, ఈ సినిమా టీజర్ విడుదల అవుతోంది అంటే… నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల ఎదురు చూపులు కూడా ప్రారంభమయ్యాయి.

2017 సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను, దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో నందమూరి అభిమానులకు ఈ దసరా పండగ మరింత ప్రత్యేకం కానుంది. ఊహించిన దాని కంటే సినిమా అద్భుతంగా వస్తోందన్న టాక్ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న నేపధ్యంలో ఫస్ట్ టీజర్ తో బాలయ్య ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో వేచిచూడాలి. హేమామాలిని వంటి బాలీవుడ్ బ్యూటీల భారీ తారాగణంతో ‘గౌతమీపుత్రశాతకర్ణి’ సినిమా వెండితెరపై నిండుగా దర్శనమివ్వనుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories