నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 118 ఫిబ్రవరి 25న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. దీనికి నందమూరి బాలకృష్ణ, తారక్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మహేశ్ కోనేరు ట్విటర్ వేదికగా తెలిపారు. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు ఘోర పరాజయం తరువాత బాలయ్య అభిమానులతో డైరెక్టుగా మాట్లాడటం ఇదే మొదటి సారి. ఎన్టీఆర్ కథానాయకుడు ఫెయిల్యూర్ తరువాత కూడా చిత్ర బృందం ఎటువంటి వేడుక ఏర్పాటు చెయ్యలేదు.
దీనితో ఆ చిత్రం ఫెయిల్యూర్ గురించి బాలయ్య ఏం చెబుతారో చూడాలి. మరోవైపు గతం లో ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్ కు అతిధి గా వచ్చిన తారక్ ఆ తరువాత ఆ సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. కనీసం రెండు భాగాల గురించి ట్విట్టర్ లో కూడా ట్వీట్ చెయ్యలేదు. దీనితో రేపు ఆయన ఏం మాట్లాడతారు అనేది ఆసక్తిగా మారింది. అది కూడా రెండు చిత్రాలు ఘోర పరాజయం పొందాకా. మరోవైపు మార్చి 1న 118 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘118’. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాలినీ పాండే, నివేదా థామస్ కథానాయికలు. మహేశ్ కొనేరు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయట. ఫిబ్రవరి 28న అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు నిర్వహించబోతున్నారు. నిర్వాణ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయబోతోంది. కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబం తరపున 2019లో మొదటి బోణి కొడతాడేమో చూడాల్సి ఉంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.



