నందమూరి బాలకృష్ణకు ఆపరేషన్!

Can Ram Gopal Varma Really Blackmail Balayya?ఓ పక్కన సినిమాలు… మరో పక్కన ఎమ్మెల్యేగా రాజకీయాలు… ఇలా రెండింటితోనూ బిజీబిజీగా మారిన నందమూరి బాలకృష్ణకు నేడు ఓ ప్రధాన ఆపరేషన్ జరిగింది. “గౌతమీపుత్ర శాతకర్ణి” సమయంలో బాలకృష్ణకు భుజం నొప్పి వచ్చిన విషయం సినీ విజ్ఞులకు తెలిసిందే. అప్పట్లో తాత్కాలికంగా వైద్యం తీసుకున్న బాలయ్య, ఆ తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకుని, రెండింటిని రిలీజ్ చేసారు. దీంతో సదరు భుజం గాయానికి పూర్తి వైద్యం అందలేదు.

దీంతో అది కాస్త ముదిరి ప్రస్తుతం ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో శనివారం నాడు బాలయ్య భుజానికి ఆపరేషన్ జరిగింది. దీంతో మరికొద్ది రోజుల పాటు నందమూరి నటసింహం హాస్పిటల్ లోనే ఉండనున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండడంతో, రాబోయే మూడు నెలల నుండి ఏడాది పాటు పూర్తిగా ఫిట్ గా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories