
2019 ఎన్నికల ఫలితాలు విడుదలై వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాతృ భాషగా ఉండే తెలుగు ను వైసీపీ అనధికారికంగా మార్చేస్తూ రాష్ట్రంలో వైసీపీ నేతలు మాట్లాడే బూతుల సంస్కృతిని అధికారిక భాషగా గుర్తించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని ఆ పార్టీ మంత్రులు, కింద స్థాయి నాయకులు, వారి కింద పని చేసే పార్టీ కార్యకర్త వరకు అందరిదీ అదే భాష. అయితే ఈ భాష ఐదేళ్ల నుంచి వినివిని విసిగిపోయిన సామాన్యుడు ఓటు అనే ఆయుధంతో వారి నోటికి తాళం వేశారు.
Also Read – వ్యవస్థలకి జగన్ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!
గత ఐదేళ్లల్లో మంత్రులు గా పని చేసిన కొడాలి నాని, పేర్నినాని, అంబటి రాంబాబు, రోజా, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్, అనిల్ కుమార్ యాదవ్ వంటి మంత్రులు కానీ ఎంపీలుగా నెగ్గి పార్లమెంట్ కు వెళ్లిన విజయ్ సాయి రెడ్డి, నందిగామ సురేష్, వంటి నేతలు కానీ ఏనాడూ మీడియా ముందుకు వచ్చినా, ఓటేసిన ప్రజలు, వింటున్న సమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రతిపక్ష పార్టీ నేతలను బూతులతో దూషించే వారు.
ఈ ఐదేళ్లలో ఏ వైసీపీ నేత కానీ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఏ నాయకుడు కానీ తమ తమ శాఖల సమీక్ష మీద కానీ, వాటి పని తీరు మీద కానీ ఏనాడూ మీడియా ముందు వచ్చి ప్రజలకు వివరించిన దాఖలాలే లేవు. మంత్రులంటే అయితే జగన్ కు భజన చేయాలి లేకుంటే ప్రత్యర్థులను బూతులు తిట్టలే తప్ప తమ శాఖల మీద ప్రజలతో చర్చలు సమావేశాలు జరపకూడదు అన్నట్టుగా ప్రవర్తించారు.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే గంట, అరగంట అంటూ ఒకరు…పర్శాంటా, అర పర్శాంటా అంటూ మరొకరు, ఐటీ పరిశ్రమల గురించి అడిగితే కోడి – గుడ్డు అంటూ ఇంకొకరు, సన్న బియ్యం ఎక్కడ అంటే సన్నాసులు అంటూ ఒకరు, రాజధాని ఎక్కడ అంటే అవసరమేముంది అంటూ, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటే పవన్ కు మూడు పెళ్లిళ్లు అంటూ ఇలా అసలు ప్రజలకు అవసరం లేని విషయాలను మీడియా ముందుంచే వారు.
దీనితో ఈ ఐదేళ్లు ఇదే ధోరణికి అలవాటు పడిన ప్రజలు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వారం రోజులలో తమ వంతు బాధ్యత గా రాష్ట్రానికి ఎం సాధించగలిగేమో చెప్పడానికి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు వివరిస్తుంటే ఇదేంటబ్బా అధికార పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులను బూతులు తిట్టకుండా విషయాన్ని వివరిస్తున్నారు అంటూ తమ ఓటుకు న్యాయం జరిగింది అనే ఆనందంలో ఉన్నారు.
Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!
కూటమి బలపరిచిన ఎంపీలు గా నెగ్గిన మచిలీపట్టణం జనసేన ఎంపీ బాలశౌరి, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో విజయవాడ – ముంబై కొత్త సర్వీసులను ప్రారంభించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ పూర్తి చేశామని, ఈ ఎయిర్ పోర్ట్ భద్రతను SPF నుంచి CISF కు AAI అప్పగించిందన్నారు. రానున్న రోజులలో విజయవాడ నుంచి కోల్కతా, వారణాసి, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంకకు సర్వీసులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ఇప్పుడు ఉదయం, సాయంత్రం మాత్రమే అందుబాటులో ఉన్న ఢిల్లీ విమాన సర్వీసులను పెంచుతామని తెలియచేసారు. అయితే గడిచిన ఐదేళ్లుగా ప్రెస్ ముందుకు వస్తే మీ కోసం నేను బటన్ నొక్కాను మీరు నా కోసం తిరిగి బటన్ నొక్కాలసిందే అంటూ జగన్, మీరు బటన్ నొక్కి మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం అంటూ వైసీపీ నేతలు ఓటు విలువను పాతాళానికి పాతాళానికి పడేసారు.
కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఐదే రోజులలోనే వైసీపీ బూతుల సంస్కృతిని సమాధి చేసి ప్రజలకు అవసరమైన అంశాల మీద శ్రద్ద పెట్టడం హర్షణీయం. ఇక నుంచి నాయకులకు ప్రజలకు మధ్య పరదాలు అవసరం లేదని, ప్రెస్ మీట్లలో బూతులు ఉండవని ప్రజలకు కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.