వైసీపి చొక్కా మడత పెట్టేసింది… ఎన్నికల సంఘం ఇంకా చూసిన్నట్లు లేదే!

Balineni-Srinivasa-Reddy-Ambati Rambabu Perni Nani

దాపరికం ఏమీ లేదు… చొక్కా మడత పెట్టి ఎన్నికలలో యుద్ధం చేద్దామని బహిరంగంగానే జగన్‌ చెప్పారు. అధినేత ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత వైసీపి నేతలు పెట్రేగిపోకుండా ఉంటారా? మొన్న బందరులో వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని సమక్షంలోనే వైసీపి కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వారిపై కేసులు నమోదయ్యాయి.

ADVERTISEMENT

మొన్న ఒంగోలు వైసీపి ఎంపీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోనే వైసీపి కార్యకర్తలు పట్టణంలోని సమతా నగర్‌లో టిడిపి నేత మేడికొండ మోహన్ రావు, కార్యకర్తలపై దాడి చేసి చితకొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు ప్రభుత్వాసుత్రిలో చేరి చికిత్స పొందుతుంటే , బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి, అనుచరులు అర్దరాత్రి ఆస్పత్రికి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. టిడిపి నాయకులను బెదిరించారు.

ఇటీవల టిడిపిలో చేరి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి దామాచర్ల జనార్ధన్ ఇద్దరూ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదు. కానీ బాలినేని ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే టిడిపి నాయకులపై కేసులు నమోదు చేశారు

ఇక మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి సెబ్ కార్యాలయంలో చేసిన వీరంగం చూసి తీరాల్సిందే. గురువారం మధ్యాహ్నం కొమెరపూడి వద్ద స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాలు తనికీలు చేస్తుండగా ఓ ద్విచక్ర వాహనంపై గోనె సంచీలో 170 మద్యం సీసాలు తీసుకువెళుతున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకొని సత్తెనపల్లిలో సెబ్ కార్యాలయానికి తీసుకువెళ్ళారు.

ఈ విషయం తెలియగానే మంత్రి అంబటి రాంబాబు హడావుడిగా అక్కడకు చేరుకొని, సెబ్ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావుపై మండిపడ్డారు. ఆ ఇద్దరు యువకులను విడిపించుకొని తీసుకుపోయారు. మద్యం సీసాలు కూడా తిరిగి ఇవ్వాలని అంబటి రాంబాబు పట్టుబట్టినా అధికారులు ఇవ్వకపోవడంతో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తానంటూ బెదిరించి వెళ్ళిపోయారు.

ఎన్నికలలో ఇంతగా రెచ్చిపోతున్న వైసీపి నేతలకు కొంతమంది పోలీస్ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డితో సహా 22 మందిపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీ వారిపై చర్యలు చేపడితే వారి కంటే వైసీపియే ఎక్కువ నష్టపోతుందని తెలిసినా వైసీపిలో ఎవరూ తగ్గేదేలే అంటూ ఇలా రెచ్చిపోతున్నారు. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమి చేస్తోందో?

ADVERTISEMENT
Latest Stories