
వైసీపి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. ఇంతకాలం టిడిపి, జనసేనలు వైసీపితో పోరాడి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము విమర్శించినవారిని లేదా తమని విమర్శించినవారినే పార్టీలోకి తీసుకోవడం సబబా కాదా?అనే విషయం పక్కన పెడితే, జనసేన పార్టీ పరంగా, రాజకీయంగా మరికాస్త బలపడేందుకు ఈ చేరిక ఉపయోగపడుతుందని వేరే చెప్పక్కరలేదు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డి వలన జనసేన ఏ మేరకు బలపడుతుందో, రాజకీయంగా లబ్ధి పొందుతుందో భవిష్యత్‌లో తెలుస్తుంది. కానీ జగన్‌కు దగ్గర బంధువు అయిన బాలినేని వైసీపిని వీడటం అంటే ‘లంక గుట్టు’ శత్రువులకు చేత చిక్కిన్నట్లే అవుతుంది.
వైసీపికి రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపిలో నేను పడిన బాధలు, అవమానాలు చాలానే ఉన్నాయి. అలాగే వైసీపిలో అంతర్గత విషయాలు (రహస్యాలు), ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలానే ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను సమయం వచ్చినప్పుడు బయటపెడతాను,” అని అన్నారు.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
కనుక వాటితో టిడిపి కూటమి ప్రభుత్వానికి మరిన్ని బలమైన ఆయుధాలు లభించనుండగా, బాలినేని శ్రీనివాస్ రెడ్డి బయటపెట్టబోయే ‘గండికోట రహస్యాలు’తో జగన్, వైసీపి నష్టపోయే అవకాశం ఉంది.
ఇక ఈ మార్పుని రాజకీయాకోణంలో చూస్తే, లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి ప్రకాశం జిల్లాలో దింపినా ఆయనతో సహా అందరూ ఓడిపోయారు. కనుక ఇప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేరు. ఒకవేళ చేయాలనుకున్నా ఇప్పుడు బాలినేని అధికార పార్టీలోకి వస్తున్నారు కనుక జిల్లా నుంచి ఆయనని తరిమికొడతారు.
ఈ నేపధ్యంలో ప్రకాశం జిల్లాలో వైసీపి ఖాళీ అయిపోవడం ఖాయం. కనుక జిల్లాలో స్థానికుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వదులుకొని జగన్ చాలా పెద్ద తప్పే చేశారని అనుకోవచ్చు.
అయితే ఆయన తన రాజకీయ సర్దుబాటు బాగానే చేసుకున్నారు. కానీ ఆయన వలన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా జనసేన పార్టీకి కూడా ఉపయోగం ఉండాలి. ఉంటుందనే ఆశిద్దాం.