రద్దయిన నోట్లు ఇంకా ఉన్నాయా? డోంట్ వర్రీ..!

banned-notes-exhchange-bankingరద్దయిన పాత 500, 1000 నోట్లు మీ వద్ద ఇంకా ఉన్నాయా? ఈ నోట్లను మార్చుకోవడానికి శుక్రవారం నాటితో గడువు ముగిసిపోయింది కాబట్టి, ఇక ఈ నోట్లు చిత్తు కాగితాలతో సమానం. దేశంలోని మొత్తం 15.44 లక్షల పెద్ద నోట్లలో బ్యాంకులకు 14 లక్షల కోట్లకు పైగా వచ్చాయన్నది అనధికారిక సమాచారం. అంటే, ఇప్పటికీ వ్యవస్థలో దాదాపు లక్షన్నర కోట్ల విలువైన రద్దయిన కరెన్సీ ఉన్నట్టు. ఈ డబ్బులో రిజర్వ్ బ్యాంక్ శాఖల ద్వారా మరికొంత డిపాజిట్ అయ్యే అవకాశాలు ఉన్నా, కొన్ని వేల కోట్లు మిగిలిపోతాయన్నది మాత్రం వాస్తవం.

ఇక వివిధ అగ్ని ప్రమాదాల్లో కాలిపోయిన కరెన్సీ, చిరిగి చిత్తుకాగితాలుగా మారి నాశనమైనవి, నదుల్లో, కాలువల్లో వదిలేసిన మొత్తం కూడా కోట్లల్లోనే ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే… ప్రస్తుతానికి చిత్తుకాగితాలేనని భావించాల్సిన రద్దయిన నోట్లను, ఓ ఆరవై లేదా 70 ఏళ్లు దాచగలిగితే, అది ఓ కుటుంబాన్ని జీవితకాలం పాటు కాపాడేంత విలువను సంతరించుకునే అవకాశాలు ఉన్నాయని మీకు తెలుసా?

ADVERTISEMENT

1970వ దశకంలో రద్దయిన భారత కరెన్సీ ఎవరి దగ్గరైనా ఉంటే, వాటి విలువ లక్షలు దాటి కోట్లల్లోకి వెళ్లింది. అలాగే ఇప్పుడు రద్దయిన నోట్లను కూడా జాగ్రత్తగా దాచి వుంచితే, అది మీ తరువాత నాలుగు లేదా ఐదవ తరానికి మీరిచ్చిన అత్యధిక ఆస్తి కావచ్చు. కాబట్టి వీలైతే ఓ నాలుగైదు నోట్లను జాగ్రత్త చేసుకోండి. అయితే ఇది తక్కువ మొత్తంలో మాత్రమే సుమీ! పెద్ద మొత్తంలో గనుక పాత కరెన్సీ ఉంటే, కేంద్రం కఠినమైన నిబంధనలను విధించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories