ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ వీడియో ఊపేస్తోంది. ఇప్పటివరకు సినిమాలలో, నిజంగా కొన్ని చేజింగ్ సన్నివేశాలు చూసుంటారు, కానీ ఈ చేజింగ్ సీన్ చూస్తే ఒళ్ళు జలదరించాల్సిందే… అనే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్… ఇలా సామాజిక మాధ్యమంలో చూసిన ఈ వీడియోను షేర్ చేసుకుంటూ నెటిజన్లు తన స్పందనలను తెలియజేస్తున్నారు. దీనికి కారణం… ప్రారంభం నుండి చివరి వరకు ఉత్కంఠభరితంగా ఆ వీడియో సాగడమే.
ఓ ఉడుము కోసం పాముల గుంపు చేజ్ చేసే ఈ వీడియోలో హైలైట్ ఏమిటంటే… అన్ని పాములను సక్సెస్ ఫుల్ గా ఆ ఉడుము తప్పించుకుని, చివరకు తన గమ్యస్థానానికి చేరుకోవడం. బిబిసి విడుదల చేసిన ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో, చేజింగ్ సన్నివేశం బాగా ఎలివేట్ అయ్యింది. స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందంటూ నెటిజన్లు జోహార్లు కొడుతున్న వీడియోను మీరు కూడా వీక్షించండి..!



