‘భేతాళుడు’ అదుర్స్… ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం..!

Bethaludu Openings Super Hit Public TalkBethaludu Openings Super Hit Public Talk‘బిచ్చగాడు’ సినిమా అపూర్వ విజయం తర్వాత తమిళ హీరో విజయ్ అంటోనీకి ఓ అరుదైన గౌరవం దక్కుతోంది. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులలోనే కాదు, సినీ ప్రేక్షకుల్లో కూడా విజయ్ అంటే ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో సహజంగానే విజయ్ తదుపరి చిత్రం ఏంటన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం కావడం.., ఆ తర్వాత ‘భేతాళుడు’ టీజర్, ట్రైలర్ విడుదల కావడం.., అదుర్స్ అనిపించే రీతిలో స్పందనను తెచ్చుకోవడం.., ఓ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం… అన్ని వడివడిగా జరిగిపోయాయి.

ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా తొలి 10 నిముషాల సినిమాను విడుదల చేసారు. తమిళంలో ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను తెచ్చుకున్న ఈ వీడియోను, తాజాగా తెలుగులో కూడా విడుదల చేసారు. ఫస్ట్ షాట్ నుండి మొదలైన ఆసక్తి, టైటిల్ ప్రజంటేషన్, చివరి షాట్ వరకు ఆద్యంతం కొనసాగింది. ఈ 10 నిముషాలు వీడియో చూసిన తర్వాత, ఖచ్చితంగా ‘భేతాళుడు’ చూడాలని సినీ ప్రేమికులు ఉండరని చెప్పడంలో సందేహం లేదు. ఆ రేంజ్ లో విజయ్ అంటోనీ ఆకట్టుకున్నాడు.

ADVERTISEMENT

ప్రతి ఫ్రేం కూడా అద్భుతంగా ఉండగా, విజయ్ అంటోనీ అందించిన స్వీయ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ‘అదుర్స్’ అనిపించక మానదు. దీంతో ‘భేతాళుడు’ సినిమా ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉంటాయని చెప్పనవసరం లేదు. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త కధ పరిచయం కానుందన్న సంకేతాలను ఈ 10 నిముషాల వీడియో స్పష్టం చేసింది. “గత జన్మలో జయలక్ష్మి చంపిందంటూ ఈ జన్మలో జయలక్ష్మిపై పగ తీర్చుకోవడానికి బయలుదేరిన” కాన్సెప్ట్ ను ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో మలచడంలో దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు.

ADVERTISEMENT
Latest Stories