పోలా… సెట్ అదిరిపోలా..!

Bharat Ane Nenu Shooting Setsఏప్రిల్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న కొరటాల – మహేష్ ల “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టడానికి ఈ నెల 27వ తేదీని నిర్ణయించారు. దీంతో శరవేగంగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తుండగా, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులను కూడా సమ్మోహితులను చేయడంలో సక్సెస్ కావడంతో, ఈ ఏడాది బిగ్గెస్ట్ సమ్మర్ బొనంజాగా ‘భరత్ అనే నేను’ నిలవనుంది.

ADVERTISEMENT

ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ అద్భుతమైన సెట్ లో ప్రిన్స్ మహేష్ బాబు మరియు కైరా అద్వానీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సెట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. కలర్ ఫుల్ గా కనపడుతోన్న ఈ అద్దాల మేడ ‘శివాజీ’ సినిమాలో రజనీ – శ్రియాలపై చిత్రీకరించిన సెట్ లా కనపడుతోంది. రాజు సుందరం కోరియోగ్రఫీ చేస్తోన్న ఈ పాట విజువల్ గా సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అంటోంది చిత్ర యూనిట్ మాత్రం! ఈ ఫోటో అలాంటి నమ్మకాన్నే ఇస్తోంది!

ADVERTISEMENT
Latest Stories