“భరత్ అనే నేను” సినిమాకు సంబంధించినంత వరకు హైప్ ఎవరైనా ఇస్తున్నారు అంటే… రామజోగయ్య శాస్త్రి అన్న ఒక్క పేరే వినిపిస్తుంది. చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసే పోస్టర్స్, టీజర్ తదితర పబ్లిసిటీ సంగతులు పక్కన పెడితే, ‘భరత్ అనే నేను’ కంటెంట్ ను హైలైట్ చేస్తూ శాస్త్రి గారు చేస్తోన్న ట్వీట్లు అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
ADVERTISEMENT
ఇప్పటికే ఫ్యాన్స్ అంచనాలను తారాస్థాయిలో లేపిన రామజోగయ్య తాజాగా మరో ట్వీట్ చేసారు. ‘అతని గుండె లోపల నుండి ప్రతి గుండెను టచ్ చేస్తాడు, ప్యూర్ జెం, పర్ ఫెక్ట్ సిఎం, అతని కన్విక్షన్ ను చూడడానికి వెయిట్ చేయలేకపోతున్నాను’ అంటూ శాస్త్రి గారు ఇచ్చిన ట్వీట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరీ ఇంత హైప్ ను అభిమానులు తట్టుకోలేరేమో శాస్త్రి గారు… ఒక్కసారి ఆలోచించండి..!
ADVERTISEMENT



