ఊహించని రోల్ చేస్తోన్న ‘ఖుషీ’ బ్యూటీ!

Bhumika in  U turn movie remakeనిన్నటితరం కథానాయికగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న భూమిక, ఈ మధ్యనే తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ సినిమాలో ఓ కీలకమైన పాత్రను చేసిన ఆమె, ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోంది. తాజాగా ఆమె ‘యూ టర్న్’ రీమేక్ లో చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

కన్నడలో హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయిన ‘యూ టర్న్’ సినిమాను, తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో భూమిక పాత్ర కూడా ప్రాధాన్యత కలిగిందిగా కనిపిస్తుందట. కన్నడలో రాధికా చేతన్ పోషించిన దెయ్యం పాత్రలో భూమిక కనిపించనుందని అంటున్నారు. ఇప్పటివరకూ నాజూకుదనంతోనే ఆకట్టుకున్న భూమిక, ఈ థ్రిల్లర్ మూవీలో దెయ్యం పాత్రను చేయడానికి అంగీకరించడం విశేషమేనని చెప్పాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories