పవన్ కళ్యాణ్‌కు యాక్టింగే సరిగా రాదు.. ఆయన హావభావాలు చూస్తే నవ్వొస్తుంది

Kishan Reddy Comments on Pawan Kalyanబీజేపీని ఇరుకునపెట్టాలని చూస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని ఒకింత ఘాటుగా విమర్శించారు బీజేపీ సీనియర్ కిషన్ రెడ్డి. పవన్ కళ్యాణ్‌కు యాక్టింగే సరిగా రాదు. పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తుంది ఎద్దేవా చేసారు కిషన్ రెడ్డి. పైగా వన్ రాజకీయ నాయకుడిగా పనికిరాడని తేల్చి చెప్పేశారు కూడా.

” పవన్ కళ్యాణ్ చిరంజీవిని అడ్డుపెట్టుకుని సినిమా యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడు అవుదామనుకుంటుంన్నాడు. పవన్ రాజకీయ నాయకుడిగా పనికిరాడు,” అన్నారు కిషన్ రెడ్డి. ఇది ఒకరకంగా బీజేపీ నుండి చాలా ఘాటైన విమర్శ అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT

బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు పవన్ కళ్యాణ్ పై కాసింత మెతక వైఖరితో ఉన్నా, తెలంగాణ నాయకులు విమర్శలు చెయ్యడం గమనార్హం. ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలకు ప్రచారం చేశారు. కొన్ని ఎన్నికల సభలలో కిషన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ తో వేదికను పంచుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories